Saturday, May 4, 2024

ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల..

తప్పక చదవండి

ఎట్టకేలకు ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. పాక్‌ క్రికెట్‌ బోర్డు, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఈ సారి టోర్నీ హైబ్రిడ్‌లో మోడల్‌లో జరుగనున్నది. పాక్‌తో పాటు శ్రీలంకలో సైతం మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు పాక్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో ఏసీసీ హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రతిపాదించింది. అయితే, పాక్‌లోనే ఆడాలని మొదట పీసీబీ పట్టుబట్టినా చివరకు అంగీకరించింది. భారత్‌ తన మ్యాచులన్నింటిని శ్రీలంకలో ఆడనున్నది. సెప్టెంబర్‌ 2న పాక్‌తో భారత జట్టు తలపడనున్నది.

టోర్నీలో ఆరు జట్లు పాల్గొననుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్‌-బీలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్థాన్ – నేపాల్ మధ్య ఆసియా కప్‌ ప్రారంభ మ్యాచ్‌ జరుగనున్నది. అదే సమయంలో శ్రీలంక గడ్డపై తొలి మ్యాచ్‌ ఆగస్టు 31న బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య క్యాండీ వేదికగా జరుగనున్నది.

- Advertisement -

భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 2న దాయాది దేశం ప్యాక్‌తో క్యాండి వేదికగా ఆడనున్నది. ఆ తర్వాత అదే నెల 4న ఇదే మైదానంలో నేపాల్‌లో తలపడనున్నది. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ ఫోర్‌ దశకు చేరుకుంటాయి. ఇందులో విజయం సాధించిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఆసియా కప్‌ 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరుగనున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు