Sunday, September 8, 2024
spot_img

ఆరో బ్రాండ్ నుంచి విభిన్న‌మైన సమ్మ‌ర్-స్ప్రింగ్ క‌లెక్ష‌న్‌….

తప్పక చదవండి

ఐకానిక్ ప్రీమియం మెన్స్ వేర్ బ్రాండ్ అయిన ఆరో తాజాగా త‌న స‌మ్మ‌ర్ స్ప్రింగ్ క‌లెక్ష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త క‌లెక్ష‌న్‌లో లేటెస్ట్ ట్రెండ్లు ఉండ‌టంతో పాటు.. మూలాల‌ను మ‌ర్చిపోకుండా ఉంటుంది. పురుషుల దుస్తుల్లో అన్ని సంద‌ర్భాల‌కూ స‌రిపోయేలా ఆరో ఉంటుంది. ఆటోప్రెస్ షర్టులు, ఆటోఫ్లెక్స్ ప్యాంట్లు, ఐకానిక్ వైట్ షర్టులతో సహా ఫార్మల్ వేర్లు ఈ కొత్త క‌లెక్ష‌న్‌లో ఉన్నాయి. ఆటోప్రెస్ షర్ట్ ముడతలు లేని వ‌స్త్రానికి ప్రసిద్ధి చెందింది. ఇది పీచ్, లీలాక్, లేత గోధుమరంగు / క్రీమ్ షేడ్స్ కలిగిన మూడు రంగులలో లభిస్తుంది. ఆటోఫ్లెక్స్ ప్యాంటు సౌకర్యవంతమైన వెయిస్ట్ బ్యాండ్ ను కలిగి ఉంటుంది. ఆరో న్యూయార్క్ లైన్‌లో ఆధునిక వర్క్ వేర్, క్యాజువల్ దుస్తులు ఉన్నాయి. ఇంకా ఫ్యూచరిస్టిక్ పోలోలు, గ్రాఫిక్ ప్రింట్ తో కూడిన టీ-షర్టులు ఉన్నాయి. ఇది ప్ర‌ధానంగా మిలీనియ‌ల్ ఆడియ‌న్స్‌కు సరైనది. టెన్నిస్ కోర్టుల నుంచి ప్రేరణ పొందిన కోర్ట్ క్లబ్ లైన్‌లో రిలాక్స్‌ డ్‌, సరదా, సోష‌ల‌బుల్‌ ఫోటోలు, షర్టులు ఉన్నాయి.

కొత్త ఎస్ఎస్ 23 కలెక్షన్ విడుదలపై ఆరో సీఈఓ సుమన్ సాహా మాట్లాడుతూ, “ఆరో నుంచి ఎస్ఎస్ 23 లైన్ సొగసు, సౌకర్యాన్ని క‌లిపి ఇస్తుంది. అదే సమయంలో లేటెస్ట్ ట్రెండ్ల‌కు అనుగుణంగా ఉంటుంది. ఆరో మీకు యుటిలిటీ, వెర్సాటిలిటీల‌తో కూడిన వివిధ రకాల వినూత్న దుస్తులను అందిస్తుంది. ఇందులో షర్టులు, ప్యాంట్లు, టీషర్టులు, పోలోలు, చినోలు, బ్లేజర్లు, సూట్లు ఉన్నాయి. ఆరో నుంచి వ‌చ్చిన ఈ లేటెస్ట్ క‌లెక్ష‌న్ ఒక విస్తృతమైన ఎసార్ట్‌మెంట్‌. ఇది వెర్సాటిలిటీకి ప్రాధాన్యం ఇస్తూనే.. పురుషుల దుస్తుల కోసం అన్ని ముఖ్యమైన సందర్భాలను కవర్ చేస్తుంది” అని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు