Sunday, October 13, 2024
spot_img

పశు మిత్రలకు కనీస వేతనం చెల్లించాలి.

తప్పక చదవండి
  • ఐడి కార్డులు, యూనిఫామ్ లు పశు సంవర్ధక శాఖ నుండి ఇవ్వాలి..
  • జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్ష.. అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ..
  • వివరాలు తెలిపిన దుంపల రంజిత్ కుమార్, పశు మిత్ర వర్కర్స్ యూనియన్, జిల్లా గౌరవ అధ్యక్షులు..

హైదరాబాద్, తెలంగాణ పశు మిత్ర వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో సోమవారం రోజున రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేసి, అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ పశు మిత్ర వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రములో గత 8 సంవత్సరాలుగా పశుమిత్ర వర్కర్స్ పనిచేస్తున్నరు. గ్రామీణ ప్రాంతాల్లో మూగజీవాలకు సోకే వ్యాధులకు వైద్యం అందిస్తున్న పశుమిత్రలను ప్రభుత్వం వెంటనే కార్మికులుగా గుర్తించి, గుర్తింపు కార్డులు, యూనిఫామ్ లు, మెడికల్ కిట్ ఇవ్వాలి. మధ్యలో ఆపేసిన ఏఐ ట్రైనింగ్ ను వెంటనే పూర్తి చేయాలి. పశువులకు సరిపడా వ్యాక్సిన్ ఇవ్వాలి. పశుమిత్రలకు వేతనం నిర్ణయించి ఇవ్వాలని, అప్పటి వరకు పారితోషికం చెల్లించాలి. ఈ. శ్రీలత జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ.. పశువులకు వైద్యం అందించడానికి మమ్మల్ని ఐకేపీ సెంటర్ల నుండి ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఎలాంటి వేతనం నిర్ణయం చేయలేదు. రాష్ట్రంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు పెంచిన ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వడానికె డబ్బులు లేవా..? అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగమణి యూనియన్ జిల్లా కార్యదర్శి, రాజేశ్వరి జిల్లా కోశాధికారి, జ్యోతి, సరిత జిల్లా ఉపాధ్యక్షులు, శ్రీలత, సరోజ జిల్లా సహాయ కార్యదర్శులు, మాధవి, లక్ష్మి, మల్లికా, రాజేశ్వరి, నీరజ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు