Thursday, March 28, 2024

అంబర్ పేటను అద్భుతంగా అభివృద్ధి చేస్తా..

తప్పక చదవండి
  • హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,
    బీసీ మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి శారదాగౌడ్..

హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
అంబర్ పేట ను సిద్దిపేట, సిరిసిల్లలా అభివృద్ధి చేసి.. రాష్ట్రంలోనే నెంబర్ ఒన్ నియోజకవర్గంగా చేస్తానని నా హృదయ పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను అన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, బీసీ మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి శారదాగౌడ్..

చెరువుల పండుగ సందర్బంగా శారదాగౌడ్ మాట్లాడుతూ.. అంబర్ పేట ప్రజలు ప్రేమమూర్తులు.. అంబర్ పేట నియోజకవర్గం ప్రేమాలయం.. అట్లాంటి ప్రజలకు ప్రతి గడప గడపకు కేసీఆర్ పథకాలు అందాలి.. ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా.. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి చెందేలా చేయడమే నా ధ్యేయం అన్నారు శారదాగౌడ్… నేడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక చెరువులు నిండు కుండలు అయ్యాయి.. మత్స్య సంపద పెరిగి కులవృత్తి చేసుకునే వారికి కల్పతరువు.. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణా ఎదిగింది అంటే.. ఇందుకు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్దరణతో, సాగునీరు సమృద్ధిగా, భూగర్భ జలాలు ఉబికి ఉబికి వస్తున్న సంఘటనలు సర్వసాధారణం అయ్యింది.. చెరువుల్లో 100 శాతం సబ్సిడీతో చేప, రొయ్య పిల్లల పంపిణి, దీనితో దాదాపుగా నాలుగు లక్షల మంది మత్స్యకారులకు లభించిన ఉపాధి ఇది తెలంగాణా సాధించినఘన విజయం..
తెలంగాణా వస్తే తెలంగాణాలో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుంటే తెలంగాణా జలకళను సంతరించుకొని తద్వారా కులవృత్తులకు జీవధార పల్లెలు సతత హరితం అవుతాయి అని ఆనాడే ఉద్యమసమయంలో కేసీఆర్ చెప్పారు.. అదే నేడు సాకారం చేశారు.. అన్నారు గుండ్రాతి శారదాగౌడ్.. ఈ కార్యక్రమంలో
ప్రతిభ, రజిత, ప్రణతి, మీరా, సునీత, చంద్రకళ, శోభ, సరస్వతి, సుమతి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు