Friday, March 29, 2024

జీ.ఏ.డీ. ఆదేశాలైనా డోంట్ కేర్..

తప్పక చదవండి
  • డిప్యుటేషన్ పై జీ.హెచ్.ఎం.సి. లోకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట వేసిన ఉద్యోగి..
  • జీఏడీ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్లక్యం వహిస్తున్న
    టి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. మేనేజింగ్ డైరెక్టర్ దేవసేన..
  • ఫైల్ దొరకడం లేదంటూ సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్న
    టి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. ఉన్నతాధికారులు..
  • ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ సనావుద్దీన్ కు వంతపాడుతున్న వైనం..
  • ఇంకెప్పుడు చర్యలు తీసుకుని అతడిని సొంత డిపార్ట్మెంట్ కు పంపుతారని ప్రశ్నిస్తున్న సామాజిక వేత్తలు..

హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాలు.. డిప్యుటేషన్ పై వచ్చిన ఒక అధికారిని అతని సొంత డిపార్ట్మెంట్ కు పంపించకపోవడం ఏమిటి..? సాధారణంగా 3 నుంచి 4 సంవత్సరాలు డిప్యుటేషన్ కాలం ముగుస్తుంది.. ప్రత్యేక పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలం అతని విధులను పొడిగించే అవకాశం ఉంటుంది.. కానీ ఏకంగా 15 ఏళ్ళు పట్టించుకోకుండా ఉన్నారంటే.. సదరు ఉద్యోగి ఆ సీట్లో కూర్చుని ఈమేరకు అవినీతి సొమ్మును వెనుకేస్తున్నాడు.. ఆ అవినీతి సొమ్ములో అధికారులకు ఎంతెంత వాటా అందుతోంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.. అతనిని అక్కడినుంచి తప్పిస్తే తమకు అందుతున్న ఆదాయం ఎక్కడ అందకుండా పోతుందో అన్న మీమాంశతోనే ఉన్నతాధికారులు జీఏడీ ఆదేశాలను సైతం పెడచెవిన పెడుతూ.. అర్ధం పర్ధం లేని కారణాలు చెబుతున్నట్లు తేటతెల్లమవుతోంది..

ప్రతిష్టాత్మకమైన జీ.హెచ్.ఎం.సి.లో ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతోంది.. ఇతర డిపార్టుమెంట్ల నుండి జీ.హెచ్.ఎం.సి. కి డిప్యుటేషన్ మీద వచ్చిన కొందరు ఉద్యోగులు.. ఇక్కడ అక్రమ సంపాదన కళ్ళముందు కనిపిస్తుండటంతో సంవత్సరాల తరబడి ఇక్కడే పాతుకుపోతున్నారు.. 15 సంవత్సరాలుగా జీ.హెచ్.ఎం.సి. లోనే పాతుకుపోయిన ఓ ఉద్యోగి షేక్ సనావుద్దీన్ వ్యవహారం ఆశ్చర్యం కలిగిస్తోంది..

- Advertisement -

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ 8, సౌత్ జోన్ కు డిప్యుటేషన్ మీద వచ్చిన
షేక్ సనావుద్దీన్ గడచిన 15 సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేసి.. తన అవినీతి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇదే విషయమై ఓ సామాజిక కార్యకర్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదుపై స్పందించిన జీఏడీ డిపార్ట్మెంట్, ( సర్వీసెస్ సి ) యూ.ఓ. నోట్ నెంబర్ 1900/సి.ఆర్. /ఏ 1/2023-1.. వి. శేషాద్రి సెక్రటరీ టు గవర్నమెంట్.. 18 మార్ఛి 2023లో సదరు షేక్ సనావుద్దీన్ పై చర్యలు తీసుకోమంటూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేశారు.. మరి ప్రభుత్వ పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖ జీఏడీ నుంచి వచ్చిన ఆదేశాలంటే సదరు డిపార్ట్మెంట్ కు చెందిన ఎం.డీ. దేవసేనకు లెక్కలేదా..? లేక సదరు షేక్ సనావుద్దీన్ పైన ఉన్న అవ్యాజమైన అనురాగమా..? అదేకాకుండా అతగాడి అవినీతి సంపాదనలో ఆమెకు, మరికొందరు అధికారులకు సైతం వాటాలు అందుతుండటం వల్లనే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా..? అన్నది తేలటం లేదు.. కాగా ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు షేక్ సనావుద్దీన్ పై చర్యలు చేపట్టి.. అతనికి సహరిస్తున్న అధికారులపై కూడా తగిన విధంగా చర్యలు గైకొని సిస్టం వ్యాల్యూస్ ని సజీవంగా నిలపాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు