Wednesday, April 24, 2024

గౌడ బందును ప్రకటించాలి.. : అయిలి వెంకన్న గౌడ్.

తప్పక చదవండి

హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకంలోను గౌడ్స్, కల్లుగీత వృతగీతదారుల ప్రస్థావన లేకపోవడం బాధాకరమని, తక్షణమే గౌడ బందును ప్రకటించి ప్రతి గౌడ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వం పది బడ్జెట్స్ ప్రవేశ పెడితే ఏ బడ్జెట్ లోను ఒక్క పైసా కేటాయించలేదు… గౌడుల సంక్షేమం విస్మరించిన ఏకైకా ప్రభుత్వం కేసీఆరే నని అసలు గౌడులు బీసీలు కాదా ఇక సహించేది లేదని హెచ్చరించారు… చెట్ల పైనుండి పడి మరణిస్తే తప్ప పైసలుయని ప్రభుత్వం బతికున్నప్పుడు మమ్ములను ఆదుకోలేని ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఎండగడతామని హెచ్చరిస్తున్నాం శవాలపై మీరు వేసే ఎక్స్ గ్రేషియో చిల్లర మాకెందుకు మేము బతికున్నప్పుడు ఆదుకోలేని ఈ అసమర్ధ ప్రభుత్వం మాకు అవసరమా అని తెలియజేస్తున్నాం… తెలంగాణ రాష్ట్ర సాధనలో గౌడుల పాత్ర కీలకం కానీ పాలనలో, అధికారంలో ఆమడ దూరంలో ఉంచి కక్ష్య పూరితంగా గౌడులను అనుచివేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం… ఒక ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సభ్యులు గానీ కేటాయించడంలో నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం… కల్లుగీత కార్పొరేషన్ కు సమైక్యాంధ్రలో ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపులు జరిగేవి తెలంగాణ రాష్ట్రంలో 2014లో కార్పొరేషన్ రద్దుచేసి బీసీ కార్పొరేషన్ లో విలీనం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది నాటునుండి నేటి వరకు పేరుకే గీతా కార్పొరేషన్ తప్ప ఒక్క పైసా కేటాయించలేదు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు