Wednesday, May 15, 2024

అమెజాన్‌ త్వరలోనే భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు

తప్పక చదవండి
  • 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి
  • 2026నాటికి సగానికిపైగా ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని అమెజాన్‌ లక్ష్యం

న్యూఢిల్లీ : ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ త్వరలోనే భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు అందించబోతున్నది. ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాంట్‌ ఇంటర్నెట్‌ సేవలైన ప్రాజెక్ట్‌ కైపర్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్న కంపెనీ.. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది. వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో 3,236 ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నది. ప్రాజెక్టులో భాగంగా 2026నాటికి సగానికిపైగా ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని అమెజాన్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. అమెజాన్‌ ఈకామర్స్‌తో పాటు ప్రైమ్‌ వీడియో సేవలను విస్తరించేందుకు దోహదపడనున్నది. ఈ క్రమంలో భారత్‌లోనూ శాటిలైట్‌ సేవలను ప్రారంభించేందుకు రెగ్యులేటరీ ఆమోదం పొందేందుకు అమెజాన్‌ ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఎఔూఖంఞవ)కి దరఖాస్తు చేసిందని జాతీయ విూడియా పేర్కొంది. ప్రాజెక్ట్‌ కైపర్‌కు భారత్లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (ఆనీు) నుంచి శాటిలైట్‌ సర్వీసెస్‌ అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. శాటిలైట్‌ ద్వారా తక్కువ ధరకే వన్‌ జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందించే అవకాశాలున్నాయి. భారత్‌లోని గ్రావిూణ, మారమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా తక్కువ ధరలకే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుతాయని పేర్కొన్నాయి. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండడంతో కంపెనీ విస్తరణకు తోడ్పాటునందించే అవకాశం ఉంది. అమెజాన్‌ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌తో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ సేవల విస్తరణకు సైతం దోహదపడనున్నది. ఇంతకు ముందు వన్‌వెబ్‌, జియో శాలిలైట్లకు ప్రభుత్వం జీఎంపీసీఎస్‌ లైన్స్‌లు మంజూరు చేసింది. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్టార్‌లింక్‌ సైతం దరఖాస్తు చేసుకోగా.. ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం స్టార్‌లింక్‌ ఐదువేలకుపైగా ఉపగ్రహాలను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. ఇదిలా ఉండగా.. అమెజాన్‌ ప్రాజెక్ట్‌ కైపర్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం భారత్‌లో ఎంత వసూలు చేయనుందనే వివరాలు తెలియరాలేదు. 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తేవాలని అమెజాన్‌ భావిస్తున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు