Thursday, October 10, 2024
spot_img

ఎస్‌జే సూర్య విలన్‌గా ఇండియన్‌ 2..

తప్పక చదవండి

ఉలగనాయగన్‌ కమల్‌హాసన్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ఇండియన్‌ 2. శంకర్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇండియన్‌ 2లో టాలెంటెడ్‌ యాక్టర్ ఎస్‌జే సూర్య మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్‌జే సూర్య ఇండియన్‌ 2కు సంబంధించిన షూటింగ్‌ కూడా ఇటీవలే పూర్తి చేశాడని ఇన్‌సైడ్‌ టాక్‌. తాజా అప్‌డేట్‌ ప్రకారం ఇండియన్‌ 2లో విలన్‌ పాత్ర కోసం ఎస్‌జే సూర్య కెరీర్‌లోనే అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకున్నాడని సమాచారం. ఈ యాక్టర్ మరోవైపు శంకర్‌ డైరెక్షన్‌లో రాంచరణ్‌ హీరోగా వస్తున్న గేమ్‌ చేంజర్‌లో కీ రోల్ చేస్తున్నాడు. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఇండియన్‌ 2 చిత్రంలో బాబీ సింహా, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌ ఇత‌ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్‌ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 ఫస్ట్‌ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కమల్ హాసన్‌ మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో 234వ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇండియన్ 2 పూర్తయ్యాక ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2 షూటింగ్‌ తైవాన్‌, సౌతాఫ్రికాలోని జోహాన్నెస్‌ బర్గ్‌తోపాటు పలు ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంది. శంకర్‌ టీం సాంగ్స్‌తోపాటు గూస్‌ బంప్స్‌ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్ ను ఈ షెడ్యూల్‌లో పెట్టినట్టు ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ చెబుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు