Saturday, July 27, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఉద్యమ కెరటం నేలకొరిగింది.. ఉద్యమ నావ నీట మునిగింది
ఉద్యమ గీతం మూగబోయింది.. నీ పాదం మీద పుట్టుమచ్చ
మాయమైంది.. పొద్దు మీద పొడుస్తున్న కాలం ఆగిపోయింది
నంది అవార్డు చిన్న బోయింది.. తూప్రాన్ తుఫాన్ నిశ్శబ్దంమైంది
కెనరా బ్యాంక్ కంటతడి పెట్టింది.. యావత్ తెలంగాణా
ముద్దు బిడ్డను కోల్పోయి .. కన్నీరు మున్నీరైంది…
నా అన్న, నా ప్రియతమ నాయకుడు
గద్దర్ ఇక లేడు రాడు అని తెలిసి
నా మాట మూగబోయింది….
జై బోలో తెలంగాణా సినిమాలో
ఆయనతో పరిచయం నన్ను శాశ్వత
తమ్ముడ్ని చేసింది….
మరువలేని మధుర స్మృతులు
మరల రావు ఆ రోజులు
లాల్ సలాం….లాల్ సలాం… లాల్ సలాం

  • చిత్తరంజన్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు