Wednesday, October 9, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నినునమ్మి ఓటేస్తే నన్నేల ముంచితివి దొర..
సారు మాట ఇస్తే – పాణమిస్తాడని
కారు గురుతే మనకు ఇలవేల్పు అనుకున్నా..
భుజము తట్టినప్పుడు పెద్దన్నవనుకుని
మా బతుకులికనుంచి మారిపోతయనుకున్న..
ఒక్క పూట నాకు బువ్వ పెట్టినప్పుడు
నా కడుపు నింపేటి మారాజువనుకున్న..
నీ.. కడుపులో దాగున్న కట్లపామిసమును
కనిపెట్టలేదయ్య – కాలయముడివని..
బతుకుదెరువు కోసమని బర్రెలు, గొర్రెలు ఇస్తే..
పిల్లలతో సల్లంగా బతుకొచ్చు అనుకున్న
ఇన్నేండ్లకు తెలిసింది నీవు ఆడిన ఆట
బందెల దొడ్డిలో నన్ను బంధించినావని
మల్లొస్తావుగా ఓటేయమని..రా నువ్వో…
నేనో.. సూసుకుందాము.. ఎట్లయితే… అట్లాయే…

  • రవి నకిరేకంటి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు