Saturday, April 27, 2024

వెల్ విజన్ పేరుతో మాయా వ్యాపారం

తప్పక చదవండి
  • ఆశకు పోయారా మీకు శఠగోపమే
  • నెట్‌ వర్క్‌ మార్కెటింగ్‌ పేరుతో నయాదందా
  • మసిబూసి మారేడు కాయను చేసేస్తారు
  • అమాయకుల బలహీనతలే వారికి ఆధారం
  • టివి, ఫ్రిడ్జ్‌, ఏసీలంటూ నిండా ముంచే ప్రయత్నం..?
  • మాయమాటలతో పేదవాన్ని కోటీశ్వరుడిని చేస్తామంటూ కటింగ్‌
  • ఫార్మ్‌ ల్యాండ్స్‌, గోట్‌ ఫార్మ్స్‌, సేవా ఫౌండేషన్‌, ట్రేడిరగ్‌ అని చెబుతూ డబ్బులు గుంజే ఎత్తుగడ
    హైదరాబాద్‌ : వెల్‌ విజన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పేరుతో దుకాణం నిర్వహణ.. వెల్‌ విజన్‌న్ఫ్ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, తక్కువ ధరకు ఫార్మ్‌ ల్యాండ్‌ లో ప్లాట్లు విక్రయిస్తాం.. మీరు పెట్టుబడి పెడితే 5% నుండి 10% వడ్డీ కూడా ఇస్తాం, వెల్‌ విజన్‌ హోమ్‌ అప్లయిన్స్‌ టివి, ఫ్రిడ్జ్‌, ఏసీ పలు ఎలక్రిట్‌ గృహ ఉపకారణాలపై వెల్‌ విజన్‌ పేరుతో బ్రాండిరగ్‌.. భారీ మొత్తంలో వెల్‌ విజన్‌ గోడౌన్స్‌ నిర్వహించబోతున్నాం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకో గోడౌన్‌ ప్రారంభించబోతున్నాం. గోడౌన్‌ లీజ్‌ కోసం ప్రాంచైసీ కోసం డబ్బులు పెట్టుబడులు పెట్టండి, 5% నుండి 10% వడ్డీ రూపంలో చెల్లిస్తాం. వెల్‌ విజన్‌ ట్రేడిరగ్‌ ఆన్‌ లైన్‌ షేర్‌ మార్కెట్‌ లో డబ్బులు పెట్టి మేము ఒళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేసి 200 రోజుల్లో మీ డబ్బును రెట్టింపుచేసి మీకిస్తాం.. వెల్‌ విజన్‌ సేవా ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం పుణ్యం మీకు మూటగట్టి పెడతాం.. వెల్‌ విజన్‌ గోట్‌ ఫార్మింగ్‌ మేకల, గొర్ల పెంపకం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను తీసుకువచ్చే లాభసాటి వ్యాపారం.. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులైపోతారు.. తమ మాటలతో సామాన్య ప్రజానీకాన్ని కళ్ళముందే పేదవాన్ని కోటీశ్వరున్ని చేస్తారు.. కూకట్‌ పల్లి గోకుల్‌ ప్లాట్స్‌ 9వ ఫేస్‌ లో టివిలు, ఫ్రిడ్జ్‌ లు గృహోపకరణాల వ్యాపారం నిర్వహించే దుఖాణం నష్టాలు రావడంతో గొలుసుకట్టు వ్యాపారాన్ని తెరమీదకు తీసుకుని వచ్చింది.. సామాన్య ప్రజలకు టివి, ఫ్రిడ్జ్‌ లాంటి గిఫ్టులు ఎరజూపి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించింది.. ఈ నెట్‌ వర్కింగ్‌ మార్కెటింగ్‌ అంటేనే మోసం.. ఈ మోసపూరిత వ్యాపారాన్ని నిర్వహిస్తూ.. ఎప్పుడు బిచాణా ఎత్తేస్తుందో.. ఆ ప్రభువుకే ఎరుక..
    మాయ చేస్తున్న మనీ సర్క్యులేషన్స్‌ పథకాలు.. డిపాజిట్లపై అధిక వడ్డీ ఆశచూపి ఆకర్షిస్తారు.. పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో హోమ్‌ మేకర్స్‌, రిటైర్డ్‌ వ్యక్తులు, విద్యార్థులు, యువతను మోసం చేస్తున్నారు. ఈ పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమవుతోంది. ఎవరికైనా కష్టపడి పనిచేయకుండా, డబ్బులు ఊరికే రావు. మల్టీ`లెవల్‌ మార్కెటింగ్‌, నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌, రెఫరల్‌ మార్కెటింగ్‌, చైన్‌ సిస్టమ్‌ మార్కెటింగ్‌, డైరెక్ట్‌ సెల్లింగ్‌ మొదలైన పేర్లతో ప్రచారమవుతున్న మనీ సర్క్యులేషన్‌ పథకాలకు బలి కావద్దని సామాన్య ప్రజలకు పోలీస్‌ వ్యవస్థ నెత్తి నోరు కొట్టుకొని చెపుతున్నా.. సామాన్య ప్రజలు మోసపోయి లబోదిబోమంటున్నారు. ఆర్థిక నేరాలను ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన గత పోలీస్‌ బాస్‌ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌.. ఇప్పుడు లేకపోవడం ఆయన లేని లోటు పోలీస్‌ విభాగంలో తెలుస్తూ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. రోజుకో కొత్త పేరుతో పుట్టుకొస్తున్న మోసాల పట్ల ప్రజలను జాగురూకులను చేయడం పోలీసులకు సవాల్‌గా నిలుస్తోంది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గత రెండేళ్లలో కరక్కాయ, ఎఫ్‌ఎంఎల్సీ, ప్రో హెల్తీవాజ్‌, సన్‌ పరివార్‌, ఈబిజ్‌, క్యూనెట్‌, సెర్ఫా మార్కెటింగ్‌, స్వధాత్రి, బైక్‌ బూట్‌, షేర్‌ బైక్‌, ఇండస్‌ వివా తదితర ఆకర్షవంతమైన పేర్లతో కంపెనీలను ఏర్పాటు చేస్తున్న మాయగాళ్లు తమ మాటల వలను విసిరి అమాయకులకు గాలం వేస్తున్నారు. అధిక వడ్డీతో సులభంగా డబ్బును సంపాదించాలని అత్యాశ పడేవారు ఈ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.
    సజ్జనార్‌ కృషి వల్లనే పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 2018 జూలై 16న ఈ తరహా నేరాల దర్యాప్తునకు ప్రత్యేకంగా ఆర్థిక నేరాల విభాగాన్ని ఏర్పాటు చేశారు. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌, డిపాజిట్ల సేకరణ తదితర పేర్లతో అధిక ఆదాయం పొందవచ్చంటూ అమాయకులను నమ్మిస్తున్నారు. తాజాగా మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ ఇండస్‌ వివా పేరుతో అత్యధికంగా కమీషన్‌ వస్తోందంటే చైన్‌ పద్ధతిలో దాదాపు 10 లక్షల మంది మోసపోయినట్టుగా, ఈ మోసం రూ.1500 కోట్ల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గత రెండేళ్లుగా ఈ తరహా మోసాలకు సంబంధించి 13 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 180 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులలో సుమారు రూ.623.48 కోట్లను వివిధ బ్యాంకు అకౌంట్‌లలో ఫ్రీజ్‌ చేయగా, రూ.7.44 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురిపై పీడీ నమోదు చేశారు..
    అసలు కూకట్‌ పల్లి, గోకుల్‌ ప్లాట్స్‌, 9 వ ఫేస్‌ వెల్‌ విజన్‌ టివి, గృహోపకరణాల దుఖాణంలో జరుగుతున్న తంతు.. నెట్‌ వర్కింగ్‌ మార్కెటింగ్‌ నిర్వహిస్తూ.. ఫార్మ్‌ ల్యాండ్స్‌ లో తక్కువ ధరకు ప్లాట్లు అమ్ముతాం.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్లాట్లు అంటగట్టి, ఎక్కువ వడ్డీ పేరుతో డిపాజిట్లు సేకరించి, ఎం.ఓ.యూ. చేయటం చట్ట విరుద్ధం.. ఇలా క్రయ విక్రయాలు నిర్వహిస్తూ టివి షో రూమ్స్‌, గొడౌన్స్‌ నిర్వహిస్తామని, ఎక్కువ డిపాజిట్లు సేకరించడం, షేర్‌ మార్కెట్‌ లో డబ్బులు డిపాజిట్‌ చేసి కొన్ని రోజుల్లోనే మీకు రెట్టింపు డబ్బులు తిరిగి ఇస్తామని మాటలు చెప్పి మీకు లైఫ్‌ టైం ఉద్యోగం ఇస్తాం, ఇంట్లో కూర్చుంటే జీతం మీ అకౌంట్‌ లో పడుతుంది, మీ జిపాజిట్లను బట్టి జీతం వస్తుంది.. మీ జిపాజిట్‌ పెరిగే కొద్దీ కమీషన్‌, జీతం పెరుగుతుంది.. ఆకర్షవంతమైన టివిలు ఫ్రిడ్జ్‌ లు ఉచితంగా ఇస్తాం.. ఇది వీరు చేస్తున్న వ్యాపారం.. ఎలాంటి పూచీకత్తు లేకుంటే, ఎక్కువ మొత్తంలో లాభాన్ని ముట్టజెపుతాం.. ఆకర్షవంతమైన బహుమతులు ఇస్తాం. ఇలా తప్పుడు ఎం.ఓ.యూ. లు చేసుకుని చట్టం దృష్టిలో బయటపడే ఆలోచనతో ప్రజలను నిండా ముంచే ప్రయత్నమా..?
    కాగా లేనివి ఉన్నట్లు.. ఉన్నవి లేనట్లు మాయచేస్తూ.. అసలు లే అ ఔట్లు ఎక్కడ ఉన్నాయి..? ఉన్నాయా.. లేవా..? హోమ్‌ అప్లయిన్స్‌ వెల్‌ విజన్‌ బ్రాండిరగ్‌ తో ఎలా మార్కెటింగ్‌ అవుతున్నాయి.. ? ఈ ఉపకరణాల నాణ్యత ఎంత..? ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా..? వీరు చేసే వ్యాపారం లీగలా.. ఇల్లీగలా..? పూర్తి ఆధారాలతో కళ్లుచెదిరే వాస్తవాలతో రేపటి కథనంలో.. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు