Saturday, May 4, 2024

60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్వహిందూ పరిషత్..

తప్పక చదవండి
  • ఘనంగా ఉత్సవాలు జరపడానికి ప్రణాళిక..

విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ ప్రాంత సంఘటనా మంత్రి ముడుపు యాదిరెడ్డి అన్నారు .. కార్య విస్తరణ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుని వలె పనిచేయాలని అన్నారు.. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ జిల్లా స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రాంత ఉపాధ్యక్షులు మోహన్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ… సెప్టెంబర్ 6వ తేదీ కృష్ణాష్టమి రోజున విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని, ఇందులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసేలా ఉండాలని అన్నారు… దేవి నవరాత్రులలో దుర్గాష్టమి కార్యక్రమం నిర్వహించాలి.. ఇందులో అతిధి, వక్త, నిర్వహణ అందరూ మహిళలే ఉండేలా చూడాలని అన్నారు… ఇందుకోసం ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్క మహిళ అయినా వచ్చేలా చూడాలని అన్నారు.. నవంబర్ 20న గోపాష్టమి కార్యక్రమం నిర్వహించి గోపూజ చేయాలని సూచించారు… ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలను సంఘటితం చేస్తూ భక్తి మార్గంలో పయనించే విధంగా చేయాలని అన్నారు.. వచ్చే 2 నెలల్లో గ్రామ రక్షణ కోసం శౌర్య జాగరణ యాత్ర కార్యక్రమం లో భాగంగా ప్రతి గ్రామం నుంచి 18నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న వారిని 22మందితో టోలి (బెటాలియన్) లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.. ఇలా కొత్తగా ఏర్పాటైన కమిటీ సభ్యులకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14వరకు సమావేశాలు నిర్వహించి వారిని దేశం కోసం, ధర్మం కోసం పని చేసే విధంగా చైతన్య వంతులను చేయాలని అన్నారు.. ఇందుకోసం ప్రఖండల వారీగా బాధ్యతలు అప్పగించాలని సూచించారు.. ఇక అక్టోబర్ 24 తరువాత సాధు సంతుల సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఇందులో భాగంగా వచ్చిన స్వామీజీ లు ఇంటింటికీ విభూది, స్టిక్కర్లు పంపిణీ చేసి కర్తవ్య బోధన చేస్తారని అన్నారు. ప్రస్తుతం దేశంలో అశాంతి కలిగించేందుకు, కొన్ని స్వదేశీ, విదేశీ కుట్రలు జరుగుతున్నాయని వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే ప్రజలు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగే జనవరి 24 నాటికి 10రోజుల ముందు నుంచి దేశం అంతటా రామమయం జరగాలని, ఇంటింటిలో హనుమాన్ చాలీసా ప్రయాణం చేయాలని అన్నారు.. దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో దేవాలయాలలో హోమాలు జరిపించి, దీపాలు పెట్టాలని అన్నారు.. ఈ కార్యక్రమం లో భజరంగ్ దళ్ ప్రాంత కో కన్వీనర్ కన్నె బోయిన వెంకట్, విశ్వహిందూ పరిషత్ నల్లగొండ విభాగ్ కార్యదర్శి గంజి సుధాకర్, నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లెబోయిన నరసింహతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రఖండల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు