పంజాబ్ సీఎం వెల్లడి..
సీఆర్పీఎఫ్ దళాలతో కల్పించే జెడ్ ప్లస్ భద్రత ను పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ తిరస్కరించారు. పంజాబ్‌తో పాటు ఢిల్లీ రాష్ట్రాల్లో పంజాబ్ సీఎంకు కేంద్ర హోంశాఖ జెడ్ ప్లస్ భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. అయితే ఆ ఆఫర్‌ను పంజాబ్ సీఎంవో తిరస్కరించింది. కానీ ఆ రెండు రాష్ట్రాల కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు జెడ్ ప్లస్ భద్రత అవసరమని పంజాబ్ సీఎంవో పేర్కొన్నది. పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భగవంత్‌మాన్‌కు కావాల్సినంత భద్రత ఉందని, సీఎం సెక్యూర్టీ కోసం ఇద్దరికి బాధ్యతలు అప్పగించడం సరికాదు అని, అలా చేస్తే సెక్యూర్టీ ఏర్పాటు విషయంలో ఇద్దరి కమాండ్ తీసుకోవాల్సి వస్తుందని, దాని వల్ల పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయని పంజాబ్ సీఎంవో తెలిపింది. సీఎం భగవంత్‌మాన్‌కు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో వారం క్రితమే జెడ్ ప్లస్ సెక్యూర్టీ కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
సీఎం భగవంత్‌మాన్ భద్రతా బృందంలో 1200 మంది విధులు నిర్వర్తిస్తున్నారని, ఆయన ఫ్యామిలీకి కూడా రక్షణ కల్పిస్తున్నారని, ఢిల్లీలోనూ ఆ దళాలు ఉన్నట్లు పంజాబ్ సీఎంవో అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీతో బోర్డర్ స్టేట్ కావడం, గతంలో హత్యాయత్నాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి కనుక .. పంజాబ్‌లో చాలా అత్యాధునిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కాకుండా.. సీఎం మాన్ మరో ప్రదేశం వెళ్లినప్పుడు అక్కడ జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కేంద్రాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది.