Friday, October 11, 2024
spot_img

పిరియాడిక్‌ టేబుల్‌, ప్రజాస్వామ్యం పాఠాలు తొలగింపు..

తప్పక చదవండి

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మరి కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది. తాజాగా పిరియాడిక్‌ టేబుల్‌ (ఆవర్తన పట్టిక), ప్రజాస్వామ్యం, శక్తి వనరులు వంటి పాఠాలను పదో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించింది. దీంతో ఎన్‌సీఈఆర్టీ టెక్ట్‌ బుక్స్‌ చదివే పదో తరగతి విద్యార్థులు ఇకపై ఈ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సిలబస్ హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా గత నెలలో 9వ తరగతి, 10వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకాల నుంచి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఎన్‌సీఈఆర్టీ తొలగించడం అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. కాగా, తాజాగా ఎన్‌సీఈఆర్టీ పదో తరగతి సైన్స్ పాఠ్యపుస్తకం నుంచి పలు చాప్టర్లను తొలగించారు. చాప్టర్‌ 5: పిరియాడిక్‌ టేబుల్‌, చాప్టర్‌ 14: శక్తి వనరులు, చాప్టర్‌ 16: పర్యావరణ సుస్థిరత వంటి అభ్యాసాలను తొలగించారు. అలాగే పదో తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్య పుస్తకంలోని చాప్టర్‌ 5: ప్రముఖ ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, చాప్టర్‌ 6: రాజకీయ పార్టీలు, చాప్టర్‌ 8: ప్రజాస్వామ్యానికి సవాళ్లు అన్న పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు. కరోనా సమయంలో విద్యార్థులపై సిలబస్‌ భారం పడకుండా ఉండేందుకు ఈ పాఠ్యాంశాలను తొలుత తాత్కాలికంగా తొలగించిన ఎన్‌సీఈఆర్టీ, తాజాగా కొత్తగా ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో వీటిని శాశ్వతంగా తొలగించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు