Friday, May 17, 2024

అనుమతులు లేని సెల్లార్ పై చర్యలెక్కడ..?

తప్పక చదవండి
  • చందానగర్ శ్రీదేవి థియేటర్ లైన్ లో ఉన్న పర్మిషన్ లేని సెల్లార్..
  • టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రబోతున్నారా.. ?
  • ప్రభుత్వ విధి విధానాలకు నిలువునా తూట్లు..
  • వందల సంఖ్యలో అక్రమ సెల్లార్ నిర్మాణాలు..

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ సర్కిల్ పరిధిలో సెల్లార్ కొట్టొద్దు అని ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు ఇచ్చినా గానీ.. సర్కిల్ పరిధిలో వందల సంఖ్యలో సెల్లార్ లు నిర్మించారు.. ఇప్పుడు ప్రతి సెల్లార్ నిండా నీళ్లు నిండి.. నిండుకుండల్లా తయారు అయ్యాయి.. దాంతో పక్కనే ఉన్న రోడ్లు, భారీ భవనాలకు ప్రమాదం పొంచి ఉన్నది.. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మిద్దెల మల్లారెడ్డి కోరారు. చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారుల నిర్లక్ష్యం వలన వర్షాలకు ఏదైనా జరగరాని విపత్తు జరిగితే అధికారులే సమాధానం చెప్పవలసి ఉంటుంది.. ప్రభుత్వం ప్రతి విషయానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.. వర్షాకాలంలో సెల్లార్ నిర్మిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేయాలని కూడా ప్రభుత్వం కోరింది.. జులై మొదటి వారం నుండి సెప్టెంబర్ ఆఖరివారం వరకు ఎలాంటి సెల్లార్ లు కొట్టకూడదని కట్టుదిట్టమైన నిబంధనలు ఉన్నవి.. కానీ ఇట్టి నిబంధనలను భేఖాతరు చేస్తూ.. నిర్మాణదారులు భారీ భారీ సెల్లార్లు కొడుతున్నారు.. దానికి కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి వత్తాసు పలుకుతున్నారు. కావున వెంటనే సెల్లార్ లను గుర్తించి ప్రమాదం పొంచి ఉన్న వాటిని వెంటనే పూడ్చి వేయాలని మిద్దెల మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

గత 15 రోజుల క్రితమే జూలై మొదటి వారంలోనే చందా డివిజన్ పరిధిలోని అమీన్పూర్ వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని కైలాస్ నగర్ వెళ్లే మూలమలుపులో అసలే పర్మిషన్ లేని భారీ సెల్లార్ కొడుతున్నారని లిఖితపూర్వకంగా చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశానని.. ప్రముఖ దినపత్రికలలో కూడా ప్రచురించారు. అయినా కానీ ఇంతవరకు అట్టి సెల్లార్ ను పుడ్చని చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు.. పర్మిషన్ లేని సెల్లార్ను క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకే తెలుసు.. అధికారులు ఈ పర్మిషన్ లేని సెల్లార్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నాారు. వెంటనే కట్టిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు