Tuesday, May 14, 2024

కీలక ఆటగాళ్లకు గాయాలు

తప్పక చదవండి
  • అందుకే రాణించలేకపోయాం : రోహిత్‌
    న్యూఢిల్లీ ; ఐసీసీ ఈవెంట్లలో వరుస ఓటములపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. కీలక ఆటగాళ్లంతా గాయాలతో జట్టుకు దూరమవడం ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ జట్టు ఓటమికి కారణమవుతుందని చెప్పుకొచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా బలమైన జట్టుగా ఉన్నప్పటికీ దశాబ్ద కాలంగా ఒక ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయింది. గత నెలలో ఇంగ్లండ్‌ వేదికగా ఆస్టేల్రియాతో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో కూడా భారత జట్టు ఓడిపోయింది. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో 10 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలకపోవడంపై విలేకరుల నుంచి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో స్పందించిన రోహిత్‌ శర్మ మొదటగా ప్రతి ఒక్క ఆటగాడు మాకు అందుబాటులో ఉండాలి. మా ఆటగాళ్లంతా జట్టుకు 100 శాతం అందుబాటులో ఉండాలి. మా ఆటగాళ్లకు ఎలాంటి గాయాల సమస్యలు ఉండకపోవడం ముఖ్యం. అని చెప్పాడు. కాగా గత నెలలో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ్గªనైల్‌ మ్యాచ్‌కు భారత జట్టులో కీలక ఆటగాలళైనా జస్పీత్ర్‌ బుమ్రా, రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యారు. వీరు లేకపోవడం భారత జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు కూడా జస్పీత్ర్‌ బుమ్రా, రవీంద్ర జడేజా దూరమయ్యారు.అన్ని బాక్స్‌లను టిక్‌ చేసుకుంటూ మంచి క్రికెట్‌ అడితే అన్ని సర్దుకుంటాయని తాను నమ్ముతున్నట్లు రోహిత్‌ శర్మ తెలిపాడు.
    ఆసియా కప్‌ క్రికెట్‌
    భారత్‌,పాక్‌ మ్యాచ్‌లన్నీ లంకలో నిర్వహణ
    న్యూఢిల్లీ,జూలై12: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌, ఇండియా మధ్య జరిగే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్‌ చైర్మెన్‌ అరుణ్‌ దుమాల్‌ తెలిపారు. ఆసియా కప్‌ ఆడేందుకు పాకిస్థాన్‌కు ఇండియా వెళ్లడం లేదన్నారు. దర్బన్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రతినిధుల సమావేశంలో దుమాల్‌ పాల్గొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జే షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్‌ దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఐసీసీ బోర్డు విూటింగ్‌ గురువారం జరగనున్నది. ఆసియా కప్‌ షెడ్యూల్‌ను కూడా ఫైనలైజ్‌ చేశారన్నారు. లీగ్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఉంటాయని, ఆ తర్వాత శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. ఇండియాక్‌, పాక్‌ మ్యాచ్‌లన్నీ డంబుల్లాలో జరిగే అవకాశాలు ఉన్నాయి. 2010 ఎడిషన్‌లో కూడా ఇలాగే మ్యాచ్‌లు జరిగాయి. కేవలం నేపాల్‌తో మాత్రమే పాక్‌ తన స్వదేశంలో మ్యాచ్‌ ఆడనున్నది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు