Friday, May 3, 2024

భక్షక అధికారిని రక్షిస్తున్నది ఎవరు..?

తప్పక చదవండి
  • ప్రభుత్వ నిధుల దుర్వినియోగం..!
  • అటకెక్కిన ఆన్ లైన్ విధానం…
  • ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారుల నుండి నగదును
    వసూలు చేసిన రుసుముకు లెక్కలు చూపడం లేదు..
  • అవకతవకలకు పాల్పడుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ,
    సూర్యాపేట ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు..
  • ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..
  • చర్యలు తీసుకోవాలంటూ న్యాయ విభాగం చురకలు..

హైదరాబాద్: డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ విభాగంలో ఏటా తూనికలు, కొలతల స్టాంపింగ్ను చేపట్టే వ్యవస్థను తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడని సూర్యాపేట, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుపై బహిరంగ ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనవలసిన లీగల్ మెట్రాలజీ విభాగం అందుకు విరుద్ధంగా అక్రమార్కులకు సహకరిస్తూ.. సదరు ఇన్స్పెక్టర్ అందిన కాడికి దోచుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య లావాదేవీలలో చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాపార నిర్వాహకులు తూనికలు, కొలతల శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా తమ వ్యాపార వ్యవహారాలను నిర్వహించుకోవాలి. వీరిపై ఎప్పటికప్పుడు అధికారులు నిఘా పెట్టి అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు చోటు ఇవ్వకుండా వినియోగదారులకు లబ్ధి చేకూరేలా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ వ్యాపారులలో మార్పును తీసుకురావాల్సిన అధికారి వెంకటేశ్వర్లు అందిన కాడికి దోచుకొని దాచుకుంటున్నాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. లీగల్ మెట్రాలజీ శాఖలో గతంలోనే ప్రభుత్వం పారదర్శకమైన సేవలను అందించాలని, మ్యాన్యువల్ ను కాదని ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఈ అధికారి వ్యాపారస్తుల నుండి ప్రామాణిక ముద్రలు, స్టాంపులు రెన్యువల్ అంటూ తన ఇష్టారాజ్యంగా నగదును తీసుకొని మాన్యువల్ రసీదులతో సొంత దుకాణం తెరిచినట్లుంది. తూనిక రాళ్లకు రెండేళ్లకు ఒకసారి ప్రామాణిక ముద్రలు, ఎలక్ట్రానిక్ కాటాకు సంవత్సరానికి ఒకసారి స్టాంపింగ్ తీసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన ఆన్ లైన్ లైసెన్సుల ద్వారా రిపేరర్ వ్యవస్థను ఉపయోగించుకునే విధానాన్ని అవలంబించింది. రిపేర్ చేసేవారు వ్యాపారి నుండి మొత్తాన్ని సేకరిస్తారు. వోచర్ను రిపేర్ చేయడం ద్వారా ధృవీకరిస్తారు. కొన్నిసార్లు అతను ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపింగ్ కోసం ప్రభుత్వ రుసుమును వసూలు చేయవచ్చు. ఇదే అదునుగా తీసుకొని మాన్యువల్ రూపేనా అందిన కాడికి డబ్బులు దండుకుని, ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపోవడం గమనార్హం. రిపేరర్ జారీ చేసిన కాపీ, రిపేరింగ్/సర్వీసింగ్ కోసం వ్యాపారుల అన్ని కథనాలను తీసుకుని, స్టాంపింగ్ కోసం లెగా మెట్రాలజీ ఇన్స్పెక్టర్కు సమర్పించాలి. ఇదీ డిపార్ట్మెంట్లో కొనసాగుతున్న వ్యవస్థ. రాష్ట్రంలో ఇలాంటి రిపేర్లు సుమారు 300 మంది ఉన్నారు.

కాగా సూర్యాపేట లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కె. వెంకటేశ్వర్లు జారీ చేసిన రిపరైర్ వోచర్ ద్వారా సేకరించిన రుసుమును తీసుకొని భారీగా డబ్బు పోగుచేసేందుకు కొత్త టెక్నిక్ను కనుగొన్నారు. అతను లైసెన్స్ పొందిన (ఎన్.ఎల్.జీ./ ఆర్ 1-2015) మాధురి వెయిటింగ్ సర్వీస్ కోడాడ్ రోడ్, సూర్యాపేట ఆర్ 1-82/2000, సప్తగిరి ఎలక్ట్రానిక్ వెగిన్ మెషినరీ, హైదరాబాద్ యొక్క రెపా చలాన్ను ఉపయోగించాడు. వాస్తవ పద్ధతి ఏమిటంటే, తూనికలు, కొలతలు ఆర్టికల్లను రిపేర్ చేసిన తర్వాత, మరమ్మత్తు కాబడిన బిల్ నంబర్ షా లెగా మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ద్వారా ధృవీకరణ సర్టిఫికేట్లో ప్రతిబింబిస్తుంది. కానీ ఇన్స్టంట్ కేసులో సర్టిఫికెట్లో అలాంటి ప్రస్తావన లేదు. కాబట్టి సేకరించిన మొత్తాన్ని సూర్యాపేటలోని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు పూర్తిగా దుర్వినియోగం చేశారని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. లెగా మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు తూనికలు, కొలతల ఆర్టికల్ల సర్వీసింగ్, రిపేర్ పేరుతో వ్యాపారుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని, బిల్లులపై లైసెన్స్ ఉన్న రిపేర్దారుల సంతకాన్ని తానే స్వయంగా వేసినట్లు బిల్లులపై స్పష్టంగా ఉన్నాయని పలువురు తెలియజేస్తున్నారు. ప్రభుత్వోద్యోగి బాగోతం కంచే చేనువేసిన చందంగా ఉంది.

- Advertisement -

అలా సేకరించిన మొత్తానికి నేటికీ లెక్కలేదు. ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లడంతో పాటు.. అవినీతి, అక్రమాలను పరోక్షంగా ప్రోత్సహించడంతో భారీ మొత్తంలో డబ్బు సంపాదించి హైదరాబాద్లోని నాగోల్లో మూడంతస్తుల నివాస భవనాన్ని నిర్మించి, తన సోదరుడిని దళారీగా ఏర్పాటు చేసుకొని భారీగా డబ్బులు వసూలు చేశాడని అంటున్నారు.

వెంకటేశ్వర్లు సూర్యాపేటలోని ఇన్స్పెక్టర్గా ప్రైవేట్ వ్యక్తుల బిల్లులతో భారీ మొత్తంలో వసూలు చేసి, ప్రభుత్వ ఖజానా కార్యాలయంలో జమ చేయలేదని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. నోటిఫికేషన్ నెం.3651/T/2020కి వ్యతిరేకంగా ఆన్లైన్ సేవలకు బదులుగా
కె. వెంకటేశ్వర్లు రిపేరింగ్ చలాన్ లను ఉపయోగించారని, మాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లను జారీ చేశారని గుర్తించి కె. వెంకటేశ్వర్లు ప్రభుత్వ రుసుము కోసం వసూలు చేసిన డబ్బుకు లెక్కలు చెప్పడంలో అవినీతి కార్యకలాపాలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తనకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషనర్ పేర్కొన్న విధంగా విచారణ జరిపి, చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

అధికారులు అవినీతి అధికారిపై అవసరమైన చర్యలు తీసుకుని, ప్రజా ధనాన్ని కాపాడి, అవినీతి అధికారులపై చట్ట ప్రకారం అవసరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సూచించడం ముదావహం. తరువాయి కథనంలో మరికొన్ని ముఖ్య కథనాలు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు