Monday, June 17, 2024

ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్..

తప్పక చదవండి

రోజు రోజుకు ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై ట్రైలర్ సహా రెండు పాటలు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించాడు. గతేడాది చివర్లో విడుదలైన టీజర్‌ ఓ రేంజ్‌లో ట్రోల్స్‌కు గురైంది. దాంతో చిత్రయూనిట్ దెబ్బకు ఆరు నెలలు షూటింగ్‌ను వాయిదా వేసి మెరుగైన వీఎఫ్‌ఎక్స్‌ను తీర్చిదిద్దడంలో మునిగిపోయింది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు తిరుగులేని రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌తో వచ్చిన నెగిటివిటీ అంతా ట్రైలర్‌తో పటా పంచలయింది. ఇటీవలే రిలీజైన ఫైనల్ ట్రైలర్ కు కూడా విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా బుకింగ్స్ ఆదివారం నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు