Saturday, May 4, 2024

‘ఓటు బ్యాంకు’నాయకులెవరు…?

తప్పక చదవండి

2023 చివరి నాటికి
రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. రోజురోజుకు ఎన్నికల సమయం దగ్గరకు
వస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పుంజుకుంటుంది.
ప్రస్తుత అధికార పార్టీతో పాటుగా ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ఇతర మరికొన్ని పార్టీలు ఓట్లుమావి, సీట్లుమావి, అధికారంలో రాబోయే రోజుల్లో మాదే రాజ్యం అనే ధీమతో ఎవరికివారుగా ఊహల అంచనాలతో
ఉయ్యాలలు ఊగుతూ, ఊహల మేడలు కడుతున్నారు. రాబోయే ఎన్నికలలో
ఎలాంటి మేనిఫెస్టోతో
ప్రజలతో మమేకమైన
కార్యక్రమాలు నిర్వహించాలి. పండగలు, ఫంక్షన్లు, శుభ,
అశుభ కార్యక్రమాలలో పాల్గొనడం, సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకోవడం జరుగుతుంది.

ఆశావాహులు…. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని ఆశ కలిగిన, ఆలోచన కలిగిన నాయకులు వాళ్లు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ యొక్క గత అనుభవాలను, ప్రస్తుత పరిస్థితులను, రాబోయే రోజులలో పార్టీ యొక్క పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు.
వారి యొక్క ప్రస్తుత ఆర్థిక, రిజర్వేషన్ పరిస్థితులు, కుల బలం, జనబలం,
బంధువర్గం, స్నేహితులు, వ్యాపార వర్గం అన్ని అంశాల నుండి రాబోయే ఓట్ల గురించి అంచనా వేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో
కార్యకర్తగా, నాయకుడిగా, సేవకుడిగా వివిధ హోదాలలో పనిచేసిన పనితీరును పరిశీలించుకోవడం జరుగుతుంది.

- Advertisement -

ఓటు బ్యాంకు….. రాబోయే ఎన్నికలలో ప్రతి ఓట్లను ఎలా సంపాదించాలి. ఏవిధంగా ప్రజాదరణ, ఎవరి ద్వారా ఏఓటు సంపాదించాలి. ఎవరికి ఎవరు సన్నిహితులు, ఎవరు చెప్పితే ఎవరు వింటారు. ఎవరి ద్వారా ఓట్లు వస్తాయి. ఎవరి ద్వారా ఓట్లు పోతాయి. ఎవరిని కలుపుకోనీ పోవాలి. ఎవరిని దూరంగా పెట్టాలి. ఎవరితో లాభం, ఎవరితో నష్టం
వంటి అంశాలను అంచనా వేసుకొని, ప్రతి అడుగును ప్రతిక్షణం ఆలోచించి తెలుసుకోవాలి.

అభిమానం…. ఎన్నికలలో అభిమానం అత్యంత ముఖ్యమైనదిగా భావించాలి. ప్రస్తుతం నాయకుల చుట్టూ నిత్యం నలబై మంది
గుంపులు గుంపులుగా తిరిగిన నాలుగు ఓట్లు
రాలని పరిస్థితి. ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఎలక్షన్ టైంకు ఎవరు వెంబడి ఉంటారో, ఎవరు ఉండరో తెలియని పరిస్థితి.
మరికొందరు నాయకుల చుట్టూ ఎవరు వెంబడి లేకున్నా ప్రజలలో మంచి పేరు, అభిమానం ఉంటుంది.
అభిమానమే ఓటును రాబడుతుంది. ఎంతమంది వెంబడి తిరిగిన, ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని ఓట్లు వచ్చాయని అంచనా వేసుకోవలసిన పరిస్థితి.

ఫేస్ బుక్, వాట్సాప్
నాయకులు…… కొందరు నాయకులు
కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనబడతారు. ప్రజలకు దూరంగా ఉంటారు.
ప్రజలలో ఉండరు. వారు ఎవరో తెలవదు.
కానీ సోషల్ మీడియాలో ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులు మాత్రం ఉంటారు.
ఇలాంటి వారిని సోషల్ మీడియా నాయకులు అంటారు. ప్రజలలో ఉండే వారిని, ప్రజలతో మమేకం అయ్యే నాయకులను ‘ప్రజానాయకులు’ అంటారు.

ఏది ఏమైనా ఎవరు ఓటు బ్యాంకు నాయకులో, ఎవరు కాదో రాబోయే ఎన్నికలలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈదునూరి మహేష్
ఎంఏ.ఎంసిజె(జర్నలిజం)
సీనియర్ జర్నలిస్ట్
వరంగల్
9949134467

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు