Saturday, July 27, 2024

హైదరాబాద్‌లో విజయ్ సేల్స్, ఏసర్ విజయవంతమైన థ్రిల్లింగ్ గేమ్-ఎ-థాన్..

తప్పక చదవండి

హైదరాబాద్‌, భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్, ఏసర్ సహకారంతో 2023 జూన్ 10 న హైదరాబాద్‌లోని విజయ్ సేల్స్ కొండాపూర్ స్టోర్‌లో ఎలక్ట్రిఫైయింగ్ గేమింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్-ఎ-థాన్ ఈవెంట్‌లో గేమింగ్ ఔత్సాహికులు వివిధ రకాల నైపుణ్యాలు, ఉత్కంఠభరిత ప్రదర్శనను చూశారు. ఇది అన్ని అంచనాలను అధిగమించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. పాల్గొనేవారిని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
హైదరాబాద్ నలుమూలల నుండి గేమింగ్ ప్రియులు కొండాపూర్ లోని విజయ్ సేల్స్ స్టోర్‌కి తరలి వచ్చారు. తమ గేమింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, లీనమయ్యే వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఆసక్తి కనబర్చారు. స్ట్రీట్ ఫైటర్ వీ, ఫిఫా 23, ఫోర్జా హారిజోన్ 5 అనేవి ఉత్తమ గేమింగ్ టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చిన తీవ్రమైన పోటీలకు యుద్ధభూమిగా పనిచేశాయి. ఈ ఈవెంట్ లో అన్నింటికంటే ముఖ్యమైంది ‘ప్లే లైక్ ఇన్‌కాగ్నిటో’ సోనాలి సింగ్ ఉండటం. ఇందులో పాల్గొనేవారు సోనాలిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం పొందారు. ఆమెతో పోటీపడుతూ వారు తమ నైపుణ్యా లను పరీక్షించుకునే అవకాశం కూడా లభించింది. విజయ్ సేల్స్ స్టోర్‌ కు హాజరైనవారు ఉత్సాహభరితమైన పోటీలలోనే కాకుండా, అనేక రకాల కార్యకలాపా లలో మునిగి ఉత్సాహాన్ని పెంచారు. వర్చువల్ రియాలిటీ గేమింగ్ ఆశ్చర్యదాయక అనుభవాన్ని అందిం చింది. అంతేగాకుండా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదృష్ట విజేతలకు అద్భుతమైన ఆశ్చర్యాలను అందించింది. పాల్గొనేవారు కాస్ ప్లే పోటీని చూసే అవకాశాన్ని కూడా పొందారు. గేమ్-ఎ-థాన్ విజేతలకు అత్యాధునికమైన ఏసర్ గేమింగ్ మానిటర్‌లు, ఆకర్షణీయమైన వోచర్‌లు, ఇతర ఉత్తేజకరమైన రివార్డులతో సహా అసాధారణమైన బహుమతులు అందించబడ్డాయి. అయితే, పాల్గొనే వారందరికీ అంతిమ బహుమతి వారి అద్భుతమైన గేమింగ్ నైపుణ్యాలను అత్యద్భుతంగా ప్రదర్శించడం.

విజయ్ సేల్స్ గురించి :
విజయ్ సేల్స్ భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చెయిన్‌లలో ఒకటి. విస్తృత శ్రేణి వినియోగదారు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, గాడ్జెట్‌లను అందిస్తోంది. 50 సంవత్సరాలకు పైగా వారసత్వంతో విజయ్ సేల్స్ తాజా సాంకేతికత, అత్యుత్తమ కస్టమర్ సేవలకు విశ్వసనీయ గమ్యస్థానంగా పేరొందింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు