Saturday, May 18, 2024

ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం..

తప్పక చదవండి

హైదరాబాద్, సోమవారం రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాలల హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాడాలి చిరమగీతం అని అన్నారు బాల కార్మికులను బంద విముక్తులను చేద్దాం ఆయన పేర్కొన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు మన బడి ఎంతో గొప్ప కార్యక్రమం ఆయన కొనియాడారు.. నేటి నుండి పాఠశాలలు ప్రారంభం అవుతూనే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం పాఠశాలలకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు.. పిల్లల హక్కులను కాల రాయకుండా వారి బంగారు బాల్యానికి విద్యను అందించవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని ఆయన పేర్కొన్నారు.. బాలల హక్కుల గురించి ప్రజలను చైతన్యం చేయడం అవగాహన కల్పించడం పిల్లలను తమ భావాలను పంచుకోవడానికి పరస్పర అవగాహన పెంచుకోవాలని అన్నారు.. తల్లి దండ్రులకు సామాజిక రక్షణతో పాటు ఆర్థిక భరోసా కల్పించినప్పుడే బాల కార్మిక వ్యవస్థ సమూలంగా రూపు మాపబడుతుందని అన్నారు.. బాలల హక్కుల గురించి భారత రాజ్యాంగ ప్రకారం విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా 2009లో విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి బాలలకు నిర్బంధ విద్య అందించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైన ఉందని పేర్కొన్నారు.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఆయన అన్నారు// చిన్నారి విద్యార్థులు చదువు ద్వారానే సమాజంలో గుర్తింపు వస్తుందని అన్నారు.. జ్ఞాన సంపదను పెంచుకోవాలని కోరారు ఏ సమాజమైనా మానవ హక్కుల్లో భాగంగా బాలల హక్కులకు భద్రత కల్పిస్తుందో ఆ సమాజమే ఉన్నతమైన సమాజమని ఆయన పేర్కొన్నారు.. బాలలచే ఎవరైనా పని చేపించినట్లైతే టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. బాలల చట్టాలు పకడ్బందీగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం.. బాలల హక్కులను ఉల్లంగించినచో కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు.. బాలల హక్కుల కోసం, బాల్య వివాహ నిర్మూల కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం, ప్రజల్లో చైతన్యం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కుల ప్రజావేదిక గత 16 సంవత్సరాల నుండి కృషి చేయడం జరుగుతుంది.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మండల విద్యాధికారి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు.. పాఠశాలలు ప్రారంభం అయినవి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తువులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం అందరు పాటుపడాలని ఆయన పేర్కొన్నారు.. బాలల చదువు భవితికి వెలుగు అనే పునాది వేద్దామని ఆయన పేర్కొన్నారు.. బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించినట్టు సుభాష్ చంద్రబోస్ తెలిపారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు