Sunday, October 6, 2024
spot_img

హైదరాబాద్‌లో ’లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ’ ఆసుపత్రిని ప్రారంభించినఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు.. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి

తప్పక చదవండి
  • ప్రముఖ సూపర్‌ స్పెషాలిటీ లిటిల్‌ స్టార్స్‌ చైల్డ్‌ హాస్పిటల్‌ ప్రస్తుతం ’లిటిల్‌ స్టార్స్‌ – షీ’గా పునర్నిర్మించి, పునరుద్ధరించబడింది…

హైదరాబాద్, నగరంలోని బంజారాహిల్స్‌ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన ’లిటిల్‌ స్టార్స్‌, షీ–ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌ను ఆదివారం ‘ఆరోగ్య, వైద్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీష్‌ రావు, ప్రఖ్యాత భారతీయ సినీ దర్శకులు ఎస్‌ఎస్‌ రాజమౌళి’లు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌ మన్నె కవితా రెడ్డితో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రాథమిక, తృతీయ, క్వార్టర్నరీ పీడియాట్రిక్‌ కేసులను నిర్ధారించడంతో పాటు వారికి సమర్థవంతంగా అత్యుత్తమ నైపుణ్యాలతో చికిత్స అందించడంలో లిటిల్‌ స్టార్స్‌ హాస్పిటల్స్‌ గత 15 సంవత్సరాలకు పైగా అంకితభావంతో కృషి చేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత పెద్ద సంఖ్యలో ప్రజలకు అసాధారణమైన వైద్య సంరక్షణను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ హాస్పిట్, సేవలను ‘పిల్లలు–మహిళల’ విభాగాలకు కూడా విస్తరింపజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్నటువంటి పీడియాట్రిక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ సేవలతో పాటు ప్రసూతి, స్త్రీ జననేంద్రియ(గైనకాలజీ) సేవలను ప్రారంభించడంతో లిటిల్‌ స్టార్స్‌ ఇప్పుడు ’లిటిల్‌ స్టార్స్‌ – షీ’గా పునర్నిర్మించి, పునరుద్ధరించబడింది. నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన గైనకాలజీ సేవలతో ’లిటిల్‌ స్టార్స్‌ – షీ’ ఆసుపత్రి సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందించడానికి సిద్ధంగా ఉంది. ’లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ’ ప్రస్తుతం 130 పడకల సామర్థ్యంతో హైదరాబాద్‌లోనే అత్యంత ప్రముఖ ప్రదేశమైన బంజారాహిల్స్‌లోని నూతన కేంద్రానికి చేరుకుంది. ఈ హాస్పిటల్‌ మెరుగైన మౌలిక సదుపాయాలతో రోగుల స్యస్థతా ప్రయాణ్నా మెరుగుపరచడానికి చికిత్సా విధానాల్లో అధునాతన టెక్నాలజీని, వినూత్న పద్దతులను పాటిస్తూ సామాజికంగా తమ సేవలను విస్తరించడానికి నిబద్దతతో ముందుకు వెళుతుంది.

మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి, ఆర్థిక వెనుకబడిన వర్గాల వారికి కూడా అత్యుత్తమ క్లినికల్‌ కేర్‌ను అందించాలనే లక్ష్యంతో టెలిమెడిసిన్‌ కోసం హాస్పిటల్‌ ప్రత్యేకంగా కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అట్టడుగు వర్గాలకు, ఆర్థిక స్థోమత లేని వారికి ఈ సేవలు సబ్సిడీతో పాటు ఉచితంగా కూడా అందించబడుతుంది. లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ కేంద్రంగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌లో కొత్త టెలిమెడిసిన్‌ సేవలను ప్రముఖ పాన్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ శ్రీ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..అత్యద్భుతంగా ఆధునికీకరించిన సౌకర్యాలతో పాటు మెరుగైన సంరక్షణ, మద్దతు సేవలను అందిస్తున్న లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ మరింత విస్తృతంగా ప్రజలకు చేరువైతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ సేవ మాత్రం ఖచ్చితంగా చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తుంది.. ముఖ్యంగా చికిత్సలో భాగంగా వైద్యలను భౌతికంగా కలవడానకి తక్కువ అస్కారమున్న వారికి ఈ సేవలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
హాస్పిటల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ డైరెక్టర్‌ డాక్టర్‌ సతీష్‌ ఘంటా మాట్లాడుతూ…..మా ఈ నూతన కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కి, దర్శకధీరులు రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఈ లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ అనేది ఒక ఆసుపత్రిగా కంటే అత్యుత్తమ వైద్య నైపుణ్యాలతో కరుణ, మద్దతు ఉందే అద్భుత ప్రదేశమని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు