సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను సన్మానించారు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం సభ్యులు.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఉజ్జల భూటాన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించిన సందర్భంగా తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ప్రతినిధులు శనివారం ఉదయం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను హైదరాబాద్ లోని ప్రధాన న్యాయమూర్తి నివాసంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు జిల్లా న్యాయస్థానాలను, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడంలో చీఫ్ జస్టిస్ ఉజ్జాల్ భూయాన్ చేసిన కృషిని న్యాయమూర్తుల సంఘం అభినందించింది. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు, హైకోర్టు రిజిష్ట్రార్ నందికొండ నర్సింగ్ రావు, ఉపాధ్యక్షులు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి కే మురళీమోహన్, సహాయ కార్యదర్శి ఉపేందర్ రావు, కార్యవర్గ సభ్యులు మండ వెంకటేశ్వరరావు, జలీల్, రాజు, సాయికిరణ్ తదితరులు శనివారం ఉదయం ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు. న్యాయమూర్తుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.