Friday, September 13, 2024
spot_img

తిరుమలలో భక్తుల రద్దీ

తప్పక చదవండి

తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 20 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో శ్రీవారి దర్శనం ) కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,347 మంది భక్తులు దర్శించుకోగా 28,358 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు వచ్చిందని వివరించారు. బెంగళూరులో త్వరలో శ్రీవారి వైభవోత్సవాలు
బెంగళూరు మహానగరంలో త్వరలో శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ జేఈవో సదా భార్గవి తెలిపారు. వైభోత్సవాల నిర్వహణకు సంబంధించి ఆమె అధికారులు, నిర్వాహకులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి బసవన గుడి సమీపంలోని నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ ను పరిశీలించారు. గ్రౌండ్ లో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై నిర్వాహకులు, అధికారులతో చర్చించారు. భక్తులు లోనికి రావడానికి, బయటకు వెళ్లడానికి ఏర్పాటు చేయాల్సిన మార్గాలు, పార్కింగ్, తాగు నీరు, సుమారు వేలాది మందికి సరిపడ సీటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఇంజినీరింగ్ పనులు, సంగీత ,సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ సేవల నిర్వహణపై అధికారులకు పలు సూచన చేశారు. ఐదు రోజులపాటు శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య ,వార సేవలను యథాతథంగా నిర్వహించి బెంగళూరు నగరవాసులు వీటిని చూసి తరించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆమె చెప్పారు. నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని జేఈవో తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు