Sunday, May 19, 2024

గోపీచంద్ కొత్త సినిమా భీమా..

తప్పక చదవండి

ఇటీవలే రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ హీరో గోపీచంద్‌. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు ఇప్పటికే కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష తో సినిమా కూడా ప్రకంటించేశాడు. గోపీచంద్ 31 పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కూడా అయింది. ఔట్ అండ్ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాతో హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌. ఈ చిత్రానికి భీమా టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గోపీచంద్‌ ఖాకీ డ్రెస్‌లో రౌద్రరూపం చూపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్‌లో ఎద్దు స్టిల్‌ కనిపిస్తోంది. గోపీచంద్‌ ఇదివరకెన్నడూ చేయని పాత్ర చేయబోతున్నట్టు తాజా లుక్‌తో తెలిసిపోతుంది.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్‌ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. గోపీచంద్‌ 31కు స్వామి జే సినిమాటోగ్రాఫర్‌. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయబోతుండగా.. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు