Saturday, July 27, 2024

సూరారం రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణ..

తప్పక చదవండి
  • 1 లక్ష 15 వేల సీడ్ బాల్స్ పంపిణీ చేసిన అమృత విద్యాలయం, హైదరాబాద్..
  • సీ20 ప్రపంచ విత్తనబంతుల ప్రచార కార్యక్రమములో భాగంగా నిర్వహణ..

హైదరాబాద్‌లోని అమృత విద్యాలయం, ఆయుద్- మాతా అమృతానందమయి మఠం (మామ్) భక్తుల సహకారంతో సూరారం రిజర్వ్ ఫారెస్ట్‌లో 1 లక్షా 15 వేల సీడ్‌బాల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సీ 20 ప్రపంచ విత్తన బంతి ప్రచారంలో భాగంగా, విద్యార్థులలో పర్యావరణ స్పృహను కలిగించడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి స్థానిక సంఘం నుండి విస్తృత మద్దతు లభించింది. అమృత విద్యాలయం, ప్రిన్సిపాల్ స్వామిని సువిద్యామృత ప్రాణ మాట్లాడుతూ.. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనేందుకు సీడ్‌బాల్‌ పంపిణీ కార్యక్రమం చక్కటి వేదికగా నిలుస్తుందని, సూరారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో సీడ్‌ బాల్స్‌ విత్తడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా వాటిపై దృష్టి సారిస్తున్నాం. మెరుగైన భవిష్యత్తు కోసం స్థిరమైన అభ్యాసాల ప్రాముఖ్యత నిస్తున్నాం అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు