అంటార్కిటికా ఖండంలో భీకర సునామీలు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల ప్రభావం యావత్ భూగోళంపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అంటార్కిటికాలో ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. కనీసం మూడు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే, అప్పుడు అంటార్కిటికాలో భీకర స్థాయిలో సునామీలు తప్పవని స్టడీలో తెలిపారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ బృందం ఈ స్టడీ నిర్వహించింది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ఈ స్టడీకి చెందిన రిపోర్ట్‌ను పబ్లిష్ చేశారు. అంటార్కిటికాలో మంచుచరియలు కూలిపోవడం వల్ల దక్షిణ ద్రువ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సునామీ ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. 2017లో రోజ్ సీ తూర్పు ప్రాంతంలో మంచుచరియిలు విరిగిపడినట్లు గుర్తించామని నిపుణులు తెలిపారు. అయితే ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగినప్పుడు అక్కడ సునామీలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అంటార్కిటికాలో వాతావరణ ప్రభావం అధికంగా ఉందని, వేడి నీరు, సముద్ర మట్టం పెరగడం, ఐస్ షీట్లు కరిగిపోవడం వల్ల సునామీలు రానున్నట్లు ప్లైమౌత్ వర్సిటీ తెలిపింది.
అంటార్కిటికాలో వచ్చే సునామీ అలలు.. దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, ఆగ్నేయా ఆసియా దిశగా వెళ్తాయని అంచనా వేస్తున్నారు. అంటార్కిటాకా సునామీల వల్ల చాలా జీవాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమేలియా షెవనెల్లి తెలిపారు.