Friday, April 26, 2024

కాక్‌పిట్‌ విండోలోంచి విమానంలోకి పైలెట్..

తప్పక చదవండి

సాధారణంగా పైలట్‌లు, ప్రయాణికులు విమానం డెక్ డోర్‌ నుంచే లోపలికి వెళ్తారు. కానీ అమెరికాలోని సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ పైలట్‌ మాత్రం డెక్‌ డోర్‌ నుంచి కాకుండా కాక్‌పిట్‌ కిటికీలోంచి లోపలికి ప్రవేశించాడు. ఓ ప్రయాణికుడు చేసిన పొరపాటు పైలట్‌ ఆ తిప్పలు తెచ్చి పెట్టింది. అమెరికాలోని శాన్‌డియాగో అంతర్జాతీయ విమనాశ్రయంలో మూడో రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శాన్‌డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన అనంతరం ప్రయాణికులంతా దిగిపోయారు. దిగి వెళ్లిపోతూ ఆఖరి ప్రయాణికుడు పొరపాటున డెక్‌ డోర్‌ను లాక్‌ చేశాడు. అలా డెక్‌ డోర్‌ను బయటి నుంచి లాక్‌ చేస్తే లోపలికి వెళ్లే తెరువాల్సి ఉంటుంది. అయితే ఆఖరి ప్రయాణికుడు డెక్‌ డోర్‌ను లాక్‌ చేసిన సంగతి పైలట్‌లు ముందే చూసుకోలేదు.

విమానం మళ్లీ బయలుదేరాల్సిన సమయంలో గమనించిన పైలట్‌ కాక్‌పిట్‌ కిటికీ ద్వారా లోపలికి వెళ్లి డెక్‌ డోర్‌ను తెరిచాడు. దాంతో ప్రయాణికులు, పైలట్‌లు లోపలికి వెళ్లడానికి వీలుపడింది. అయితే పైలట్‌ కాక్‌పిట్‌ కిటికీలోకి దూరుతున్న దృశ్యాన్ని మ్యాట్‌ రెక్స్‌రోడ్‌ అనే ప్రయాణికుడు తన మొబైల్‌లో బంధించాడు. అనంతరం ఆ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

- Advertisement -

‘జోక్‌ కాదు.. ఆఖరికి ఫ్లైట్‌ దిగిన ఓ ప్రయాణికుడు డెక్‌ డోర్‌ను లాక్‌ చేశాడు. దాంతో పైలట్‌ డోర్‌ ఓపెన్‌ చేయడానికి కాక్‌పిట్‌ కిటికీలోంచి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఫ్లైట్‌ ఎక్కొచ్చు’ అని ఆ ట్వీట్‌లో రెక్స్‌రోడ్‌ రాసుకున్నాడు. అయితే, దానికి ఎయిర్‌లైన్స్‌ రిప్లై ఇచ్చింది. ‘ఇలాంటివి సాధారణంగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మీరు ప్రతిరోజు చూడరు అంతే’ అని పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు