Thursday, September 12, 2024
spot_img

కొత్త సినిమా విశేషాలు చెప్పిన శ్రీకాంత్ అడ్డాల..

తప్పక చదవండి

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్‌ అడ్డాల. తొలి సినిమానే శ్రీకాంత్‌ అడ్డాలకు తిరుగులేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏకంగా మహేష్‌, వెంకటేశ్‌లను పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాస్సీ మల్టీస్టారర్‌ తెరకెక్కించాడు. ఈ సినిమా వసూళ్లు అప్పట్లో సంచలనమే రేపాయి. ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా కేవలం కుటుంబ నేపథ్యంతో సినిమా తీసి కోట్లు కొల్లగొట్టిన ఘనత శ్రీకాంత్‌ అడ్డాలకే చెందుతుంది. శ్రీకాంత్‌కు ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత మెగా ప్రిన్స్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తూ ‘ముకుందా’ తీశాడు. కమర్షియల్‌గా ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. విమర్శకుల మెప్పు పొందింది. రెండేళ్ల తర్వాత మళ్లీ మహేష్‌తో ‘బ్రహ్మోత్సవం’ సినిమా తీశాడు. ఏడు తరాలు వెనక్కి వెళ్లాలనే కాన్సెప్ట్ తో చేసిన ఈ సినిమా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. బాక్సాఫీస్‌ దగ్గర ఘోర పరాజయం చూసింది. దాంతో ఐదేళ్ల వరకు మరో సినిమా చేయలేదు. ఇక చివరగా వెంకటేష్‌తో ‘అసురన్‌’ రీమేక్‌ చేశాడు. ‘నారప్ప’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. సెన్సిబుల్‌ దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్‌ అడ్డాల మాస్‌ సబ్జెక్ట్‌ను కూడా డీల్‌ చేయడంలోనూ దిట్ట అని నిరూపించాడు. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ శ్రీకాంత్‌ అడ్డాల మరో సినిమా చేయలేదు.

కాగా తాజాగా శ్రీకాంత్‌ అడ్డాల తన కొత్త సినిమాను ప్రకటించాడు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంలో ఓ రా రస్టిక్‌ సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను జూన్‌ 2న రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే హీరో గురించి ఏమి రివీల్‌ చేయలేదు. కాగా ఈ సినిమాతో మిర్యాల రవిందర్‌ రెడ్డి మేనల్లుడు హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా 1980 బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది తెలుస్తుంది. ఆ టైమ్‌లో కోనసీమలో రాజకీయాలు, అక్కడ వర్గ పోరాటాలు, కులాల ఆదిపత్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని, కాస్త రా కంటెంట్‌తోనే శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు