లార్డ్స్ శార్దూల్ బిగ్ వికెట్ తీశాడు. రెండో సెషన్‌లో తన తొలి ఓవర్‌లోనే సెంచరీ బాది జోరుమీదున్న స్టీవ్ స్మిత్(121)ను బౌల్డ్ చేశాడు. బంతిని డిఫెండ్ చేయాలనుకున్నాడు. కానీ, బంతి బ్యాట్‌కు తగిలి ఎడ్జ్ తీసుకొని వికెట్లకు తాకింది. దాంతో, స్మిత్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. స్మిత్ వెనుదిరగడంతో 387 వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. కీపర్ అలెక్స్ క్యారీ (8), మిచెల్ స్టార్క్(0) క్రీజులో ఉన్నారు. 99 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్… 387/6.