Wednesday, October 16, 2024
spot_img

సస్పెన్స్ ఎలిమెంట్స్‌ తో ధూమమ్‌ ట్రైలర్‌..

తప్పక చదవండి

మలయాళ స్టార్ హీరో ఫహద్‌ ఫాసిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ధూమమ్‌. యూ టర్న్‌ ఫేం పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్‌ ముందుగా అందించిన అప్‌డేట్‌ ప్రకారం ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. మనకు థియేటర్లలో వస్తున్న పబ్లిక్‌ సర్వీస్ యాడ్స్ అందరూ చూసే ఉంటారు. అన్ని థియేటర్లలో.. అన్ని సినిమాలకు, అన్నీ షోలకు ముందు ఈ యాడ్‌ ప్లే అవుతుంది. ఇదే యాడ్‌ను జనమంతా చూసే విధంగా చేస్తే ఎలా ఉంటుందని టీం హెడ్‌ను అడుగుతున్నాడు.

ఆ తర్వాత కొత్త ఫోన్‌, కొత్త కారు, పెద్ద ఇల్లు.. ఇవన్నీ వాటికి సమాధానం.. అంటున్నాడు ఫహద్ ఫాసిల్‌. సినిమా ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌ చుట్టూ ఉండబోతుందంటూ చెబుతూనే.. కథేంటో సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ధూమమ్‌ ఫస్ట్‌ లుక్‌ నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. కేజీఎఫ్‌ ప్రాంచైజీని ప్రేక్షకులకు అందించిన టాప్ లీడింగ్ బ్యానర్ హోంబలే ఫిలిమ్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో అచ్యుత్‌ కుమార్‌, వినీత్‌, జాయ్‌ మాథ్యూ, దేవ్‌ మోహన్‌, అనూ మోహన్‌, నందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు