Saturday, July 27, 2024

ఉపాధ్యాయుల భర్తీ కోసం పాఠశాలల బంద్

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో గల ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏ.ఐ.ఎస్‌.ఎఫ్‌), స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.ఎఫ్‌.ఐ) , డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (పి.డి.ఎస్‌.ఎఫ్‌) పాఠశాలల బంద్‌కు పిలుపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక వేల మంది ఉపా ధ్యాయ శిక్షణ తీసుకొని ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల కోసం పడి గాపులు కాస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం లోని పోలీసు డిపార్ట్మెంట్‌ లో సబ్‌ ఇన్స్పెక్టర్‌, పోలీసు కానిస్టేబుల్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌,పైర్‌ కానిస్టేబుల్‌, పైర్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.మిగిత ప్రభుత్వ శాఖల్లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 11, గ్రూప్‌ 111, గ్రూప్‌ 4, నోటిఫికేషన్‌ జారీ చేశారు.గురుకుల విద్యాలయ సొసైటీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల్లో, గురుకుల కళాశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠశాలల్లో అనేక వందల వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అనేక సబ్జెక్టు లను బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన, హరిజన, గిరిజన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకపోవ డంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జూన్‌ 12 వ తేదీన పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్న ఇంకా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు వేసవి సెలవుల్లో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తామని వాగ్దానాలు, హామీలు ఇచ్చిన ఇప్పటికీ అనేక సబ్జెక్టు లకు పుస్తకాలను పంపిణీ చేయలేదు. విద్యా శాఖ లో ఖాళీ గా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడం వల్ల నిరుద్యోగులకు అవకాశం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని కోరారు. 12 వ తేదీన సెలవు ప్రకటించిన ప్రయివేటు బడులు: తెలంగాణ రాష్ట్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాల పాఠశాలల బంద్‌ పిలుపు మేరకు అనేక ప్రయివేటు పాఠశాలలు ముందు గానే సెలవులను ప్రకటించారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రయివేటు పాఠశాలల్లో ఎలాంటి ఆస్తి నష్టం చేయకుండా పాఠశాల లను ముందస్తుగా బంద్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కేసు తెలంగాణ రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు లో పెండిరగ్‌ లో ఉంది.హైకోర్ట్‌ లో ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కేసు తేలకుండా ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టాలేమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు అంటు న్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ పాఠ శాలల్లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగిన తర్వాత ఉపాధ్యాయుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.
` డాక్టర్‌. ఎస్‌. విజయ భాస్కర్‌, 9290826988

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు