భోజనం చేసిన తర్వాత పానీపూరి తినేందకు వెళ్లిన ప్రభుత్వ టీచర్‌తో పాటు షాపు యజమానిని ఇద్దరు దుండగులు కాల్చి చంపిన ఘటన బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో వెలుగుచూసింది. శనివారం రాత్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన మహ్మద్ నూరుల్లా (42) గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్లగా బైక్‌పై వచ్చిన దుండగులు నూరుల్లాతో పాటు దుకాణ యజమాని సికందర్ దాస్ (40)పై కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు ఆపై ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు. డిన్నర్ అనంతరం పానీపూరి తినేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుకాణానికి వెళ్లగా దుండగులు నూరుల్లాతో పాటు షాపు యజమానిపై కాల్పులు జరిపి ఇద్దరినీ బలిగొన్నారని నూరుల్లా కుటుంబ సభ్యులు తెలిపారు.
పాత కక్షలతోనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఘటన సమాచారం అందగానే ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టానికి తరలించారు.