రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాబల్యం తగ్గుతోందని, అతను బలహీనపడుతున్నాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇటీవల ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ దళం .. పుతిన్‌పై తిరుగుబాటుకు ప్రయత్నించినట్లు విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన జెలెన్‌స్కీ ఈ విషయాన్ని తెలిపారు. వాగ్నర్ దళం పట్ల పుతిన్ రియాక్షన్ గమనించామని, అతను చాలా బలహీనంగా స్పందించాడని జెలెన్‌స్కీ తెలిపారు. పుతిన్ అన్నీ కంట్రోల్ చేయడం లేదని తెలుస్తోందని, రష్యా లోపలికి చొచ్చుకెళ్లి కొన్ని ప్రాంతాలను వాగ్నర్ దళం టేకోవర్ చేసుకుంటని, అంటే ఆ ప్రాంతాల్లో పుతిన్ కంట్రోల్ లేదని తెలుస్తోందని జెలెన్‌స్కీ అన్నారు. పుతిన్ ఇన్నాళ్లూ వాడిన అధికారం ఇప్పుడు క్షీణిస్తున్నట్లు చెప్పారు. ప్రిగోజిన్‌కు లభిస్తున్న మద్దతు గురించి పుతిన్ ఆందోళన చెందుతున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు.