అమరావతి, పాఠశాలలో చేర్చే సమయంలో తప్పనిసరిగా తండ్రి పేరు మాత్రమే నమోదు చేయాలని ‘‘పాఠశాలల యాజమాన్యాలు’’ చేస్తున్న డిమాండ్‌ల వల్ల వందలాది మంది బాలల భవిష్యత్తు అందకారంలో పడిందని, వెంటనే ‘‘రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ కమీషన్’’ జోక్యం చేసుకొని బాలల భవిష్యత్తు కాపాడాలని అక్రమ రవాణా భాదిత మహిళలు మరియు వ్యాపార లైంగిక దోపిడి బాధితుల రాష్ట్ర సమాఖ్య ‘‘విముక్తి’’ నాయకులు కోరారు. ‘‘విముక్తి’’ రాష్ట్ర నాయకులు మంగళవారం మంగళగిరిలోని ‘‘రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ కమీషన్’’ చైర్మన్ కేసలి అప్పారావును కలసి ఒక వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఎయిడ్స్ నివారణా శాఖ అధికారిక లెక్కలు ప్రకారం రాష్ట్రంలో 1.33 లక్షల మంది మహిళలు వేశ్యా వృత్తిలో మ్రగ్గుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య రెండు రెట్లు ఉండవచ్చని స్వచ్ఛంద సంస్థలు అంచనా. వీరిలో 75% మందికి పిల్లలు ఉన్నారు. వారిలో 14 సం॥లోపు పిల్లల్లో 57.61% మంది పిల్లలు మాత్రమే నేడు పాఠశాలకు వెళ్తున్నారు. మిగిలిన వారు తమ తండ్రి ఎవరో తెలియక, పట్టించుకొనే వారు లేక వీధి బాలలుగా, పింప్స్‌గా, బాల కార్మికులుగా, జులాయిగా తిరుగుతూ ఉన్నారని 2018లో ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన మాదిరి సర్వేలో వెళ్ళడైంది.వీరిలో చాలామంది భర్తల దౌర్జన్యం, హింస తట్టుకోలేక ఆ కుటుంబం బయటకు వచ్చినవారే, అలాగే మరోకొంత మంది విడాకులు పొంది ఉన్నవారు, మరి కొంతమంది మోసపోయి పిల్లలను కన్నవారు. ఇలాంటి మహిళలు తమ పిల్లలను పాఠశాలలో చేర్చుకోవడానికి పాఠశాలల యాజమాన్యం తండ్రి పేరు తప్పక ఉండాలి అని, అలాగే కొందరు పుట్టిన రోజు దృవ పత్రంలో ఒక తండ్రి పేరు, ఇప్పుడు ఆధార్ కార్డుల్లో ఒక మరో పేరు ఉంది కనుక మేము అనుమతించము అని అంటున్నారు. 2015లో సుప్రింకోర్టు బర్త్ సర్టిఫికేట్‌లో తండ్రిపేరు ఉండాలి అని, ఒత్తిడి చేయవద్దని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం, 2018లో మద్రాస్ హైకోర్టు, 2019లో గోవా ప్రభుత్వం, డిల్లీ ప్రభుత్వం, ప్రభుత్వప్రయివేట్ పాఠశాలల్లో చేరే విధ్యార్ధులకు తప్పనిసరిగా తండ్రి పేరు ఉండాలని ఒత్తిడి లేకుండా తల్లి అనుమతి మేరకు ఆమె పేరు నమోదు చేయవచ్చని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం పిల్లలు అందరూ నాణ్యమైన విధ్య అందించేందుకు నాడు
నేడు, అమ్మవడి, విధ్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న ఈ తరుణంలో అక్రమ రవాణా బాధిత మహిళలు, సెక్స్ వర్కర్ల పిల్లలను పాఠశాలల యాజమాన్యం, హెడ్ మాస్టర్లు తల్లి అనుమతి మేరకు తల్లి పేరు మాత్రమే నమోదు చేసుకొనేలా రాష్ట్ర విధ్యాశాఖ ద్వారా తగిన ఆదేశాలు పాఠశాలలకు ఇవ్వాలని ‘‘విముక్తి’’ నాయకులు రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ కమీషన్‌కు ఇచ్చిన ఆ వినతి పత్రంలో కోరడం జరిగింది. ఈ సమావేశంలో ‘‘రాష్ట్ర బాలల హక్కుల రక్షణ మరియు పరిరక్షణ’’ కమీషన్ చైర్మన్ శ్రీ కేసలి అప్పారావు, సభ్యులు డా॥రాజేంద్ర, డా॥జి.సీతారామ్, శ్రీమతి పద్మావతి, శ్రీమతి ఆదిలక్ష్మి, శ్రీమతి లక్ష్మీదేవితో పాటు విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి అపూర్వ, జనరల్ సెక్రటరి శ్రీమతి పుష్పావతి, శ్రీమతి మౌనిక మరియు శ్రీమతి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-