- ఆగస్టు ఒకటో తేదీన లాంచింగ్..
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్‌మీ.. తన రెడ్‌మీ12 సిరీస్ ఫోన్ల టీజర్ రిలీజ్ చేసింది. ఆగస్టు ఒకటో తేదీన రెడ్‌మీ12 4జీ, రెడ్‌మీ12 5జీ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. బడ్జెట్ ధరలో రెడ్‌మీ12 5జీ ఫోన్ కోసం స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఎంతోకాలంగా వేచి చూస్తున్నారు. రెడ్‌మీ12 4జీ ఫోన్ ధర రూ.9,999, రెడ్‌మీ12 5జీ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. రెడ్‌మీ12 4జీ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 6జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. రెడ్‌మీ12 5జీ ఫోన్ కూడా రెండు వేరియంట్లు – 6జీబీ విత్ 127 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ల్లో లభిస్తుందని భావిస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీన లాంచింగ్ సందర్భంగా రెడ్ మీ తన రెడ్‌మీ12 4జీ, రెడ్‌మీ12 5జీ ఫోన్ల ధరలను ప్రకటిస్తుందని తెలుస్తున్నది. రెడ్‌మీ12 4జీ ఫోన్ గ్లాస్ బ్యాక్ పానెల్‌తో వస్తుంది. సిల్వర్ మెటాలిక్ రిమ్స్‌తో కూడిన కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ14 వర్షన్ మీద పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 80-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరాతో వస్తున్నది.
6.79-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటది. పాస్టెల్ బ్లూ, మూన్ షైన్ సిల్వర్, క్లాసిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది రెడ్‌మీ12 4జీ ఫోన్. రెడ్‌మీ12 4జీ తరహాలోనే రెడ్‌మీ12 5జీ ఫోన్ ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 4జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుందని సమాచారం. స్నాప్ డ్రాగన్ 4జెన్ 2 వర్షన్ ప్రాసెసర్‌తో వస్తున్న మాట నిజమైతే భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్ లో లాంచింగ్ ఇదే తొలిసారి అవుతుంది.