Friday, May 3, 2024

జీవన్ కిరణ్ పేరిట ఎల్ఐసీ కొత్త ప్లాన్..

తప్పక చదవండి
  • ఎన్నెన్నో బెనిఫిట్స్..

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన కస్టమర్ల కోసం సరికొత్త టర్మ్ పాలసీ అందుబాటులోకి తెచ్చింది. జీవన్ కిరణ్ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీ.. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు మరియు జీవిత బీమా పాలసీ. మెచ్యూరిటీ టైం పూర్తయిన తర్వాత మొత్తం వెనక్కు ఇచ్చేస్తారు. పాలసీ టైంలో ఏం జరిగిన పాలసీదారు కుటుంబసభ్యులకు అండగా నిలుస్తుంది. సాధారణ టర్మ్ పాలసీల్లో ప్రీమియం మొత్తం వెనక్కు చెల్లించదు. కానీ ఈ ప్లాన్ కింద పాలసీ టైంలో ఇన్సూరెన్స్ హామీతోపాటు మెచ్యూరిటీ టైంలో ప్రీమియం సొమ్ము వాపస్ చేస్తుంది ఎల్ఐసీ.

18 ఏండ్ల నుంచి 65 ఏండ్ల లోపు వారు జీవన్ కిరణ్ ప్లాన్ కింద జీవిత బీమా పాలసీ చేయొచ్చు. కనీస పాలసీ మెచ్యూరిటీ గడువు 28 ఏండ్లు కాగా, గరిష్టంగా 80 ఏండ్ల మెచ్యూరిటీ టెన్యూర్ ఉంటుంది. 10 ఏండ్ల నుంచి 40 ఏండ్ల టర్మ్‌తో ఈ ప్లాన్ లభిస్తుంది. కనీసం రూ.15 లక్షల ఇన్సూరెన్స్ హామీతో ఈ పాలసీ కొనవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తం పాలసీ హామీ అన్న పరిమితి లేదు. కనీస ప్రీమియం రూ.3000 అయితే, సింగిల్ ప్రీమియం రూ.30 వేలుగా ఎల్ఐసీ నిర్ణయించింది. ఏడాదికోసారి గానీ, రెండు సార్లు గానీ ప్రీమియం మొత్తం చెల్లించవచ్చు.

- Advertisement -

జీవన్ కిరణ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పాలసీ తీసుకున్న బీమా దారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ తర్వాత మొత్తం ప్రీమియం చెల్లిస్తుంది. అధిక ప్రీమియంలు, రైడర్లపై చెల్లించిన మొత్తం, పన్ను మినహాయిస్తారు. రెగ్యులర్ ప్రీమియంలతోపాటు సింగిల్ ప్రీమియం పాలసీకీ ఇదే రూల్ వర్తిస్తుంది. మెచ్యూరిటీ డేట్ తర్వాత ఇన్సూరెన్స్ కవరేజీ రద్దవుతుంది.

టర్మ్ పాలసీ మొదలైన తర్వాత కవరేజీ టైంలో పాలసీదారు మరణిస్తే హామీ మొత్తం కుటుంబ సభ్యులకు చెల్లిస్తుంది ఎల్ఐసీ. ఇది ఒకేసారి గానీ, ఐదేండ్లపాటు లేదా ఆరు నెలలకోసారి, మూడు నెలలకోసారి, నెలకోసారి గానీ విడతల వారీగా గానీ చెల్లిస్తుంది. ఈ విషయమై పాలసీదారు ప్రత్యేకంగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియంపై ఏడు రెట్లు బెనిఫిట్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంపై 125 శాతం బెనిఫిట్ లభిస్తుంది. ఆత్మహత్య మినహా ప్రమాదవశాత్తు మరణంతోపాటు అన్ని రకాల మరణాలకూ ఈ ప్లాన్ కవరేజీ లభిస్తుంది. గృహిణులు, గర్భిణులను ఈ జీవన్ కిరణ్ ప్లాన్ నుంచి మినహాయించింది ఎల్ఐసీ. ప్రసవం తేదీ నుంచి ఆరు నెలల తర్వాతే మహిళలు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోని వారికి కొన్ని షరతులు ఉంటాయి. స్మోకింగ్, స్మోకింగ్ అలవాటు లేని వారికి ప్రీమియం రేట్లలో తేడాలు ఉంటాయి. జీవన్ కిరణ్ పాలసీని ఎవరైనా ఎల్ఐసీ వెబ్ సైట్ ద్వారా గానీ, ఎల్ఐసీ ఏజంట్ల ద్వారా గానీ కొనుగోలు చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అమెక్స్ కార్డు, యూపీఐ, ఐఎంపీఎస్, ఈ-వాలెట్ల ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. దీనిపై ఎటువంటి రుణ వసతి లభించదు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు