Tuesday, May 7, 2024

ప్రభుత్వానికి రేషన్ డీలర్ల అల్టిమేటం..

తప్పక చదవండి
  • డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేస్తాం..
  • తీవ్రంగా హెచ్చరించిన రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు..
  • హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన..
    రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు.. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ రేషన్ డీలర్లు హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. పట్టణాల్లో రూ. 50 నుంచి రూ. 60 వేలు.. జిల్లాల్లో రూ. 30 నుంచి రూ 40 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే క్వింటాలుకు రూ. 250 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ విధానంలో రేషన్ ఇవ్వాలని.. అమాలి ఫ్రీగా ఇవ్వాలని అన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులను బంద్ చేసి.. సమ్మె చేస్తామని రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు హెచ్చరించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు