Sunday, May 5, 2024

రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కు స్పెషల్ కోఆర్డినేటర్ గా సజ్జు మహమ్మద్ నియామకం..

తప్పక చదవండి

సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న రాజీవ్ గాంధీ క్విజ్ కాంపి టీషన్ కు హుజురాబాద్ నియోజక వర్గానికి క్విజ్ కాంపిటీషన్ స్పెషల్ కోఆర్డినేటర్గా సజ్జాద్ మొహమ్మద్ ను నియమించిన తెలంగాణ యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి 7661 899 899 అనే నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లింక్ వస్తుంది.. ఈ లింకులో రిజిస్ట్రేషన్ చేసుకొనే చివరి తేదీ జూన్ 17
సాయంత్రం ఐదు గంటల వరకు, జూన్ 18వ తేదీ ఆన్ లైన్ లో ఈ పరీక్షను నిర్వ హించడం జరుగును.. ప్రతి ఒక్క యువతీ, యువకులంతా కూడా ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 44 బహుమతులను గెలుపొందిన వారికి ఇవ్వడం
జరుగుతుందన్నారు.. మొదటి బహుమతి లాప్టాప్, రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్, మూడో బహుమతి ట్యాబ్.. ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళా టాపర్ కు స్పెషల్ గిఫ్ట్ గా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్.. పది స్మార్ట్ వాచ్ లు, 10 ఇయర్ బర్డ్స్, పది హార్డ్ డ్రావ్స్ , 10 పవర్ బ్యాంకులను బహుకరించబడును.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు