Tuesday, April 16, 2024

పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకులో 183 పోస్టులు..

తప్పక చదవండి

లా మేనేజర్‌, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, ఫారెక్స్‌ డీలర్‌, ట్రెజరీ డీలర్‌, ఎకనమిస్ట్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్‌, బీఈ, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, షార్ట్‌ లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ద‌ర‌ఖాస్తు విధానం అన్‌లైన్‌లో ఉండ‌గా.. జులై 12 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు.
మొత్తం పోస్టులు : 183

పోస్టులు : లా మేనేజర్‌, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, ఫారెక్స్‌ డీలర్‌, ట్రెజరీ డీలర్‌, ఎకనమిస్ట్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌లు : పోస్టుల‌ను బ‌ట్టి బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్‌, బీఈ, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష(Written Test), షార్ట్‌ లిస్టింగ్‌(Short listing), పర్సనల్‌ ఇంటర్వ్యూ (Personal interview) ద్వారా ఎంపిక ఉంటుంది.
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి. జీతం : నెలకు రూ.36000 నుంచి రూ.78230 వ‌ర‌కు.. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో.. దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150. చివ‌రితేదీ : జులై 12.. వెబ్‌సైట్ : https://punjabandsindbank.co.in/.. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు