Friday, May 17, 2024

పోక్సో కేసు లేనట్టే..

తప్పక చదవండి
  • మంత్రి బ్రిజ్‌భూషణ్‌పై 1000 పేజీల ఛార్జిషీట్..
  • లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ
  • పోక్సో కేసు తొలగించాలని 500 పేజీల నివేదిక
  • ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన భారత స్టార్ రెజ్లర్లు..
  • బ్రీజ్ భూషణ్ కు క్లీన్ చిట్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు..

న్యూ ఢిల్లీ, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ పై నమోదైన కేసు కొత్త మలుపు తీసుకుంది. మైన‌ర్‌ను లైంగికంగా వేధించిన‌ట్లు బ్రిజ్ భూష‌ణ్‌పై స్టార్ రెజ్ల‌ర్లు ఆరోపిస్తూ.. ఫిర్యాదు చేశారు. ఆ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ ఢిల్లీ పోలీసులు మైన‌ర్‌ను బ్రిజ్ వేధించిన‌ట్లు ఆధారాలు లేవ‌ని 1000 పేజీల ఛార్జిషీట్ లో తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు రిపోర్టు ఇచ్చారు. బ్రిజ్‌పై మైన‌ర్ దాఖ‌లు చేసిన ఎఫ్ఐఆర్‌ను ర‌ద్దు చేయాల‌ని పోలీసులు త‌మ రిపోర్టులో కోరారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన కేసుల్లో రెండు బెయిలబుల్ నేరాలతోపాటు మరో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. అయితే ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌కు పోక్సో కేసులో ఢిల్లీ పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఏడుగురు రెజ్లర్లలో ఒకరు మైనర్ అని.. ఆమెపైనా బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడని ఆ మైనర్ తండ్రి మొదట ఫిర్యాదు చేయడంతో ఏప్రిన్ 28 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో బ్రిజ్ భూషణ్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టారు. అయితే తర్వాత ఆమె మైనర్ కాదని.. ఆమె తండ్రి తన కేసును వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆయనపై పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టుకు 500 పేజీల నివేదికను ఢిల్లీ పోలీసులు సమర్పించారు. దీనిపై జులై 4 వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గత కొన్ని నెలలుగా అగ్రశ్రేణి రెజ్లర్లు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఏడుగురు మహిళా రెజర్లు బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీలోని కన్నౌట్‌ ప్యాలెస్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరుగురు మహిళా రెజర్లతో ఏప్రిల్‌లో తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మరో రెజ్లర్‌ మైనర్ అని.. ఆమె పైన కూడా బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో ఏప్రిల్‌ 28 న రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఆమె మైనర్ కాదని తర్వాత తండ్రి వెల్లడించాడు. దీంతో పోక్సో కేసును తొలగించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు.

- Advertisement -

ఇటీవల కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బ్రిజ్‌ భూషణ్‌పై జూన్ 15 లోపు ఛార్జిషీట్ దాఖలు చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో రెజ్లర్లు తమ నిరసనలను తాత్కాలికంగా విరమించారు. అయితే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తీర్చకపోతే ఈ ఏడాది జరగనున్న ఏషియన్ గేమ్స్‌ను బాయ్‌కాట్ చేస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. మరోవైపు.. రెజ్లింగ్ ఫెడరేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఎన్నికలకు సంబంధించి జమ్ము కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రిటర్నింగ్ అధికారిగా నియమించింది. జూలై 6 న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్యానెల్‌ను ఎన్నుకోనున్నట్లు వెల్లడించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు