- పార్టీని అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచన
- టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
- మహిళల హత్యలు లైంగిక వేధింపులు పెరిగాయి,
- సమస్యలపై తెలుగు మహిళా విభాగం పోరాటం చేస్తుంది
- తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి
హైదరాబాద్ : మహిళ శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని మహిళ లేనిదే ప్రపంచం లేదన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలంగాణ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ..ఎన్టీఆర్ కు మహిళల పట్ల ఉన్న గౌరవానికి సంకేతంగా జెండాలో పసుపును తీసుకొచ్చారు. రాష్ట్రంలో నిశబ్దంగా ఉన్న టీడీపీని మేల్కొల్పాలంటే.. మహిళలు ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో టీడీపీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మహిళలు కీలక పాత్ర పోషించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు వెళ్లేందుకు..రాష్ట్ర తెలుగు మహిళా విభాగం క్రియాశీలంగా పనిచేయాలన్నారు. కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ కార్యాలయం లో మహిళలలు కోలాహలం జరుగుతున్నదని బయట మాట్లాడుతుండటం శుభసూచకం అన్నారు. ఇంకా కొంత మందికి రాష్ట్ర పార్టీ కమిటీలో మహిళలకు అవకాశాలు కల్పించాల్సి ఉందని అన్నారు. వారు ఇచ్చే సలహాలు, సూచనలను రాష్ట్ర పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని, రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడపడానికి మహిళల పాత్ర ఎంతో కీలమని స్పష్టం చేశారు.
తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మాలాంటి వారు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తూ… పని చేస్తున్నాం. ఏమీ ఆశించడం లేదని.. కష్టపడి పని చేసి మహిళలకు న్యాయం జరిగేవిధంగా పోరాటం చేస్తామన్నారు. మహిళలను ప్రోత్సహించింది తెలుగుదేశం అన్నారు. మహిళల హత్యలు పెరుగుతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులూ ఎక్కువవుతున్నాయి. ఇటువంటి సమస్యలపై తెలుగు మహిళా విభాగం పోరాటం చేసి టీడీపీకి గౌరవం పెరిగేలా పని చేస్తామని అన్నారు.50 శాతం రిజర్వేషన్ల కొరకు పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్ర పార్టీ తెలుగు మహిళ విభాగం చేసే పోరాటాలకు అండగా నిలబడాలని కోరారు. మహిళల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.
పొలిట్ బ్యూరో సభ్యులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ …తెలుగు మహిళా విభాగం సమస్యలను అధ్యయనం చేయాలని,చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని అన్నారు. బాసర త్రిబుల్ ఐటీలో ఇటీవల జరిగిన రెండు సంఘటనలు అవి స్టూడెంట్స్ సమస్య తో పాటు మహిళలకు భద్రత కరువైందని, దేశంలోనే మొట్ట మొదటిసారిగా మహిళలకు విశ్వ విద్యాలయాన్ని ఎన్టీఆర్ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు ఆర్టీసీ లో మొదటిసారిగా మహిళలకు కండక్టర్లు గా, డ్రైవర్లుగా అవకాశాల ను కల్పించారన్నారు. తెలుగు మహిళా శక్తిని బయటి ప్రపంచానికి చాటాలని తెలిపారు.
జాతీయ పార్టీ అధికార ప్రతినిధి,టి. జ్యోత్స్న మాట్లాడుతూ… తెలుగు మహిళ అంటే ఏమిటో అందరి చెవులలో మారుమ్రోగేలా సమస్యలపై పని చేయాలని అన్నారు.స్థానిక సంస్థలలో, విద్యా అవకాశాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ టీడీపీ అని అమె తెలిపారు.పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ ముఖ్యమంత్రి అవడం కోసం అందరం కలిసి పోరాడాలన్నారు.తెలుగు మహిళ విభాగానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే,కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ… నేను ఉన్నానని ముందుకు వచ్చి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ జెండాను రెపరెపలాడి స్తున్నారని అన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మహిళలు కీలక పాత్ర పోషించే విధంగా కాసాని జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు.ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, రాష్ట్రంలో కాసాని ని ముఖ్యమంత్రిగా చేసుకుందాం అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి,అధికార ప్రతినిధి సూర్యదేవర లత, కార్యనిర్వాహక కార్యదర్శి లీలాపద్మ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్,అజ్మీరా రాజునాయక్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్, మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్,రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు సాయితులసి, సంధ్యపోగు రాజశేఖర్,పార్లమెంట్ పార్టీ అబ్జర్వర్లు పి. సాయిబాబా,అశోక్ కుమార్ గౌడ్, గుళ్లపల్లి ఆనంద్, రాంచందర్రావు,నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు బిల్డర్ ప్రవీణ్, తాతా మాధవీలత, రాష్ట్ర పార్టీ నాయకులు షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారం
ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రహాసన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించాగా..ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.