హైదరాబాద్ : తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షల్లో 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఎంపీసీ విభాగంలో 85.73 శాతం, ఎంబైపీసీ స్ట్రీమ్‌లో 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. ఇక ఎంపీసీ స్ట్రీమ్‌లో 78.61 శాతం మంది, బైపీసీ విభాగంలో 78.62 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 17న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 54,700 మంది అబ్బాయిలు, 43,574 మంది అమ్మాయిలు ఉన్నారు. ఎంపీసీ విభాగంలో 43,001 మంది అబ్బాయిలు, 3,357 మంది బాలికలు అర్హత సాధించగా, బైపీసీ స్ట్రీమ్‌లో.. 43,006 మంది అబ్బాయిలు, 37,746 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులు, అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.