Wednesday, May 15, 2024

వాస్తవాలను కప్పి పెడుతున్న ఐటిడిఏ అధికారులు..

తప్పక చదవండి
  • పాల్వంచ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో నెలకొన్న దుస్థితి..

పాల్వంచ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో మహిళా వార్డెన్ భర్త తరచూ వసతి గృహంలోనే ఉంటూ నిబంధనలను ఉల్లంగించడమే కాకుండా.. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ పత్రికలో వచ్చిన విషయాలను పరిశీలన చేసేందుకు వెళ్లిన అధికారులు విషయాలను తప్పుదారి పట్టిస్తూ.. వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని పీ.డీ.ఎస్.యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. సంధ్య, కాంపాటి పృధ్వీ గురువారం నాడు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే గిరిజన ఆశ్రమాలలో ఇలాంటి దుర్ఘటనలు వెలుగులోకి రావడం.. ఐటీడీ అధికారుల వైఫల్యమే అని అన్నారు. ఎందుకంటే మహిళా విద్యార్థినిల వసతి గృహంలో మహిళా వార్డెన్ల భర్తలే చలామణి అవుతున్న విషయాలు అధికారులకు తెలిసినా.. పట్టీ పట్టనట్లు వ్యవహరించడం మూలంగా విద్యార్థినిల పట్ల వారి ప్రవర్తన అసభ్యకర విషయాలు బయటపడుతున్నాయని.. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాస్తవ విషయాలు వెలుగులోకి రానీయకుండా.. విద్యార్థినిలతో అబద్ధపు సాక్షాలు చెప్పిస్తూ.. విద్యార్థినిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. విద్యార్థి సంఘాల నుండి అనేక కంప్లైంట్ లు అందినా అధికారులు చెవున పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో వార్డెన్ భర్త వసతి గృహంలోనే ఎందుకు ఉంటున్నాడని వారు ప్రశ్నించారు. వందల మంది విద్యార్థినిల్లో వారికి జరిగిన అవమానం ఎవరూ బయటకు చెప్పుకోలేరనే దీమాతో కొంతమంది ఇలా ప్రవర్తిస్తున్నారని వీటిని నియంత్రించాల్సిన అధికారులు నిద్రపోవడం వల్లనే వసతి గృహాలలో ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నాయని వారు తెలిపారు. తక్షణమే వాస్తవ విషయాలను పరిశీలన చేసి, చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు