Tuesday, April 30, 2024

న్యూర్చుర్‌ డాట్‌ ఫార్మ్‌ యొక్కబీ టు బీ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ న్యూర్చుర్‌ డాట్‌ రిటైల్‌..

తప్పక చదవండి
  • ఆన్‌లైన్‌-ప్రత్యేక ఉత్పత్తుల ఆవిష్కరణతో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభాన్ని వేడుక చేస్తోంది

భారతదేశపు అతిపెద్ద బీ 2 బీ ఏజీ – ఇన్‌పుట్‌ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన న్యూర్చుర్‌ డాట్‌ రిటైల్‌ సమగ్ర పంట సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. వాటిని తన మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచుతోంది. ఈ ఆన్‌లైన్‌-ప్రత్యేక మైన ఉత్పత్తులు కలుపు సంహారకాలు, శిలీంద్రనాశకాలు, క్రిమి సంహారకాలు, జీవ-ఉద్దీపనలను కలిగి ఉంటాయి.. ఈ ఉత్పత్తు లు యూనిక్వాట్‌, టర్ఫ్‌, లాన్సర్‌, ఈల్డ్‌ విన్‌, మాన్‌జేట్‌, అమె రెక్స్‌, రైస్‌బాక్‌, ఇమిడాస్టార్‌, లాంబ్డా స్టార్‌ వీటిలో ఉన్నాయి. ఆవిష్కరించబడిన ఉత్పత్తి పోర్ట్‌ ఫోలియోలో కలుపు నియంత్రణ, విత్తన శుద్ధి, పైరు ఎదుగుదల, శాఖల విస్తరణ, నేలలోని పోషకా హారాన్ని అందించడంలో సహాయపడే పంట రక్షణ, బయో-ఉద్దీపనలు, పంట పోషకాహార ఉత్పత్తులను కలిగి ఉంటుంది. విత్తనాలు వేయడం నుండి పెరుగుదల, పరిపక్వత దశల వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలను ఇవి పరిష్కరిస్తాయి. ఈ ఆవిష్కరణ న్యూర్చుర్‌ డాట్‌ ఫార్మ్‌ యొక్క న్యూర్చుర్‌ డాట్‌ రిటైల్‌ విభాగానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఎందుకంటే ఈ సంస్థ తన ఆన్‌లైన్‌-ప్రత్యేకమైన ఉత్పాదనలను విస్తరించింది. డిజిటల్‌ వాణిజ్యం వైపు అగ్రి-ఇన్‌పుట్‌ కంపెనీల ఆలోచనల ప్రగతిశీల మార్పును కూడా సూచిస్తుంది. ఈ ఉత్పత్తులు యూ.పీ.ఎల్‌. ఎస్‌.ఏ.ఎస్‌. సీఈఓ, ముఖ్య అతిథి ఆశిష్‌ దోభాల్‌ సమక్షంలో సంస్థ రిటైలర్‌ నెట్‌వర్క్‌ లో న్యూర్చుర్‌ డాట్‌ రిటైల్‌ ఫ్లాగ్‌షిప్‌ శుభ్‌ ఆరంభ్‌ ఈవెంట్‌ ద్వారా ఆవిష్కరించబడ్డాయి. యూ.పీ.ఎల్‌. ఎస్‌.ఏ.ఎస్‌. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ దోభాల్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో సుమారు 350,000 నమోదిత, లైసెన్స్‌ పొందిన వ్యవసాయ-ఇన్‌పుట్‌ రిటైలర్లు 150 మిలియన్ల రైతులకు ఆయా ఉత్పా దనలను అందిస్తున్నారు. ఈ వ్యవసాయ-ఇన్‌పుట్‌ ఉత్పత్తులు చాలావరకు సంప్రదాయ నెట్‌వర్క్‌ (ఆఫ్‌ లైన్‌) ద్వారా పంపిణీ చేయబడతాయి. ఆన్‌లైన్‌-ప్రత్యేకమైన ఉత్పత్తి శ్రేణిని ప్రారంభించడానికి న్యూర్చుర్‌ డాట్‌ రిటైల్‌ తో సహకరిస్తూ మేం ఇప్పటి వరకూ చేరుకోలేకపోయిన మార్కెట్‌లకు సైతం మా ఉత్పాదనలను అం దించగలుగుతాం. డిజిటల్‌ ఛానెల్‌లను వృద్ధి ఇరుసులుగా ఉపయోగించుకోవచ్చు. ఈ దశ సంప్రదాయ పంపిణీ ఛానెల్‌లు ప్రభావితం కాకుండా ఉండేలా చూసుకోవడం ద్వారా అగ్రి-ఇన్‌పుట్‌ కంపెనీల ఆసక్తిని కూడా కాపాడుతుంది’’ అని అన్నారు. న్యూర్చుర్‌ డాట్‌ రిటైల్‌ బిజినెస్‌ హెడ్‌ విశాల్‌ దూబే మాట్లాడుతూ, ‘‘ఖరీఫ్‌ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్‌-ప్రత్యేక ఉత్పత్తులను మా ప్లాట్‌ఫామ్‌ లో ప్రారంభించేందుకు మేం సంతోషిస్తున్నాం. ఆన్‌లైన్‌-ప్రత్యేక ఉత్ప త్తులు 14 రాష్ట్రాల్లో 72 గంటల డెలివరీ వాగ్దానంతో అందుబాటులో ఉంటాయి. వ్యవసాయ-రిటైలర్లు సరస మైన ధరలకు పంట జీవిత చక్రం అంతటా అత్యుత్తమ వ్యవసాయ-ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయవచ్చు. మేం వ్యవసాయ-రిటైలర్‌ల వృద్ధికి కొత్త మార్గాలను ప్రారంభిస్తూ మరిన్ని ఆన్‌లైన్‌ ప్రత్యేక ఉత్పత్తులను వేగంగా జోడిస్తాం’’ అని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు