Saturday, July 27, 2024

అధికారులెక్కడ..?

తప్పక చదవండి
  • దేవరకొండ ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులు లేక గదులకు తాళాలు..
  • పలుమార్లు హెచ్చరించినా తమ వైఖరిని మార్చుకోమంటున్న అధికారులు ఎవరు..?

తెలంగాణ రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థను బ్రష్టు పట్టించేంతవరకు తమ వైఖరిని మార్చుకోనున్నట్టు వుంది ప్రభుత్వం. దానికి ఉదాహరణ మొన్న విఆర్వోలను, ఇప్పుడు వీఆర్ఏలను కూడా రెవిన్యూ వ్యవస్థ నుండి పంపించడంతో చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించే వారు లేకపోవడంతో.. రైతులు నానా అవస్థలకు గురవుతున్నారని.. ఇలాంటి తరుణంలో దేవరకొండ పట్టణం పరిధిలో రెవెన్యూ కార్యాలయం ఆధ్వర్యంలో అధికారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారా అంటే.. అవుననే అంటున్నారు రైతులు. ఒక అధికారి ఉంటే మరొక అధికారి లేకపోవడంతో రైతుల పిటిషన్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయని.. వాటిని పరిష్కరించే వారు లేకపోవడంతో రైతులు తమ పొలాల సమస్యలను గత ఐదారు సంవత్సరాల నుండి నానా ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయకపోవడం అది రెవెన్యూ అధికారులకే దక్కుతుందని దేవరకొండ మండలం పరిధిలో ఉన్న పలు గ్రామాల రైతులు వారి గోడును వినిపించారు.. రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ ఆధ్వర్యంలో పనిచేసే క్రింది స్థాయి సిబ్బంది ఏ ఒక్కరు కూడా సక్రమంగా పనిచేయకుండా.. వారి ఇష్టానుసారంగా సమాధానం ఇస్తున్నారని.. ఇదేమిటి అని అడిగితే వివరణ ఇవ్వకపోగా ప్రజా ప్రతినిధులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఇప్పటికైనా వారు ఒంటెద్దు పోకడ వ్యవహారం మార్చుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. పలుమార్లు గతంలో ఉన్న ఉన్నతాధికారులు హెచ్చరించినా మెమోలు జారీ చేసినా.. వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చేసేదేమీ లేక వారు పనులు కూడా మిగతావారితో చేయించడం జరుగుతుందని ఎమ్మార్వో కార్యాలయం ముందు రైతులు చెవులు కొరుక్కుంటున్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఉండి రైతులకు సహకరిస్తారని అనుకుంటే, వేళాపాళా లేకుండా ఊరు మీద బైరాగి తిరిగినట్టు వారి స్వంత పనుల కోసం తిరుగుతున్నారని రైతులు అనుకుంటున్నారు. ఇప్పటికైనా వారి నడవడిక మార్చుకోవాలని, సరైన సమయంలో కార్యాలయానికి వచ్చి వారి విధులను పారదర్శకంగా నిర్వహించాలని రైతులకు సహకరించే విధంగా నడుచుకోవాలని రైతులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు