- ఎరిస్ లేదా ఈజీ 5.1 గా న్యూ వేరియంట్..
- ఓమైక్రాన్ వేరియంట్ ను పోలిఉన్న లక్షణాలు..
- వైరస్ నిర్మూలనకు వైద్య బృందాల కసరత్తు..
బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎరిస్ లేదా ఈజీ 5.1 అని ఈ కొవిడ్-19 న్యూ వేరియంట్‌ను పిలుస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్యూ వేరియంట్ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. సాధారణంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులే ఉన్నాయని, ఆ తర్వాత ఎరిస్ వేరియంట్ కొవిడ్ కేసులదే రెండో స్థానమని వారు తెలిపారు.