Friday, May 17, 2024

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్

తప్పక చదవండి

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి అభిమానులు, ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆడియెన్స్ నుంచి నుంచి సుబ్బు, చరణ్, తులసి, శృతి, మీడియా ఫ్రెండ్స్ నుంచి ఐడియల్ బ్రెయిన్ జీవి చేతుల మీదుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా
దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ – మా సినిమా ట్రైలర్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒక కొత్త కాంబినేషన్ లో నవీన్, అనుష్క, యూవీ క్రియేషన్స్, నేను కలిసి సినిమా చేశామంటే అందుకు ఇన్ స్పైర్ చేసింది కథే. రెండున్నర నిమిషాల ట్రైలర్ లో మేము కొంతే ఎంటర్ టైన్ చేయగలిగాం. రేపు థియేటర్ లో పూర్తి సినిమా చూస్తున్నప్పుడు కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తారు. కథ ఓకే అయ్యాక అనుష్క గారికి ఇలాంటి సబ్జెక్ట్, క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది అనిపించింది. అదే టైమ్ లో తను కూడా ఇలాంటి ఒక వెరైటీ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. సో నేను కథ చెప్పగానే ఆమెకు బాగా నచ్చింది. నవీన్ హీరో అని చెప్పినప్పుడు అనుష్క గారు రైట్ ఛాయిస్ అని చెప్పారు. వీళ్లిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ వల్లే మూవీ ఇంత మ్యాజికల్ గా వచ్చింది. ఇదొక ఎంటర్ టైనింగ్ మూవీ మాత్రమే కాదు. ఒక ఎమోషన్ ఉంటుంది. ఇవాళ్టి యూత్.. రిలేషన్స్ ను చూస్తున్న దృష్టి కోణం ఉంటుంది. పెళ్లి ఒక్కటే కాదు వాళ్లు ఏర్పర్చుకునే ప్రతి రిలేషన్ లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం. ట్రైలర్ లో మీరు చూసిన పాయింట్ తోనే సినిమా ఉండదు. మిమ్మల్ని ట్రైలర్ తో మిస్ గైడ్ చేస్తున్నాం. సినిమాలో మరో యూనిక్ పాయింట్ ఉంటుంది. అదేంటో సినిమాలో చూడాలి. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వెరీ క్లీన్ ఫిల్మ్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సెప్టెంబర్ 7న థియేటర్స్ లో కలుద్దాం. అని అన్నారు.

నటుడు మహేశ్ ఆచంట మాట్లాడుతూ – జాతి రత్నాలు సినిమాలో అన్నతో కలిసి నటించాను. ఆ సినిమాకు నాకు మంచి పేరొచ్చింది. డైరెక్టర్ మహేశ్ అన్న నాకు రా..రా కృష్ణయ్య టైమ్ నుంచి తెలుసు. పదేళ్లుగా ఆయనను కలుస్తూనే ఉన్నాను. ఈ సినిమాలో నవీన్ అన్న ఎనర్జీ సర్ ప్రైజ్ చేస్తుంది. అనుష్క గారి సైజ్ జీరో సినిమాలో చిన్న రోల్ చేశాను. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికింది. నవీన్ అన్న జాతి రత్నాలతో 70 కోట్ల వసూళు మూవీ చేశాడు. ఈ సినిమాతో 100 క్రోర్ కలెక్షన్ చేయాలని కోరుకుంటున్నా. దర్శకుడిగా మహేశ్ అన్నకు పేరు రావాలి. అలాగే యూవీ సంస్థకు ఈ సినిమాతో మరో హిట్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ – హ్యూమన్ రిలేషన్స్ మీద మంచి ఎంటర్ టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. జాతి రత్నాలు హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఒత్తిడికి గురయ్యాను. ఫైర్ యాక్సిడెంట్ లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా జాతి రత్నాలు సినిమా రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే ఓ నటుడిగా నాకేం కావాలి. ఎన్ని బాక్సాఫీస్ హిట్స్ వచ్చినా, ఎన్ని రికార్డులు సాధించినా ఇంత కంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అలా ఆ సినిమాతో మీరు నాపై చూపించిన అభిమానం ఎంతో కదిలించింది. మిమ్మల్ని ఎలా ఎంటర్ టైన్ చేయాలి. ఇంకా ఎలాంటి కొత్త సబ్జెక్ట్ తీసుకోవాలి అని ఆలోచించాను. కొత్త తరహా సినిమాలు ఇష్టపడే మీకు ది బెస్ట్ మూవీ ఇవ్వాలని చాలా కథలు విన్నాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన ఈ స్టోరి చాలా ఎగ్జైట్ చేసింది. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే తప్పకుండా నచ్చుతుందనే ధైర్యం కలిగింది. స్టాండప్ కామెడీ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. నిజంగానే స్టాండప్ కామెడీ షోస్ కండెక్ట్ చేసి రియల్ ఆడియెన్స్ తో మా సినిమాలో సీన్స్ షూట్ చేశాం. నేను కూడా మరే సినిమా ఒప్పుకోకుండా పూర్తిగా ఈ మూవీ మీదే దృష్టి పెట్టా. రొమాంటిక్ కామెడీ మూవీస్ తో పోల్చితే మా సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ఆమెతో నా కాంబినేషన్ బాగుంది. మా మధ్య టైమింగ్ కుదిరేందుకు ఒకట్రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించాం. ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే. సినిమాలో అనుష్క చేసే రచ్చను చూస్తారు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ కెమిస్ట్రీ మీద రన్ అయ్యే సినిమా ఇది. గత రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ మీదే మేమంతా పనిచేశాం. సినిమాను అంతగా నమ్మాం. ఒక కథను మీ ముందుకు తీసుకువద్దామని నమ్మకంతో పనిచేశాం. సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వస్తోంది. చూసి ఎంజాయ్ చేయండి. యాక్షన్ మూవీస్ చేసేందుకు కూడా నేను సిద్ధమే. అయితే ప్రేక్షకులు నన్ను వైవిధ్యమైన కథల్లో ఆదరించినంత కాలం అన్ని జానర్స్ మూవీస్ చేస్తూనే ఉంటా. ప్రభాస్ అన్నకు మా మూవీ ట్రైలర్ నచ్చింది. ప్రభాస్ అన్నకు థాంక్స్. అన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు