Monday, February 26, 2024

మైనంపల్లి రోహిత్ కు బ్రహ్మరథం పడుతున్న మెదక్ ప్రజలు..

తప్పక చదవండి
  • సంక్షేమం పేరుతో నియోజకవర్గంలో దూసుకుపోతున్న రోహిత్
  • అధికార, ప్రతిపక్ష నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న వైనం
  • కేసీఆర్, కేటీఆర్ లే నా రోల్ మోడలంటున్న మైనంపల్లి రోహిత్..
  • వారి స్పూర్తితోనే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాని వెల్లడి .. !
  • పార్టీ అవకాశం ఇస్తే ప్రజలకు మరింతగా సేవ చేస్తానని ప్రకటన .!
  • తాగునీరు, వైద్యం, ఆసరా, బడి పిల్లలకు వసతులు ఒకటేమిటి
    రోహిత్ చెయ్యని పనుందా అంటూ నియోజకవర్గంలో టాక్
  • రోహిత్ కు టికెట్ ఇస్తే గెలుపు పక్కా అంటున్న మెదక్ ఓటర్లు

( వాసు, పొలిటికల్ కరస్పాండెంట్.. )

మెదక్ జిల్లా రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆశావహులు తమ గెలుపు కోసం ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లాను చూసుకుంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిపై స్థానికులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఆమెను ఓడించడం ఖాయమన్న ప్రచారం నియోజకవర్గంలో చెక్కర్లుకొడుతుంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) కొత్త వ్యక్తికీ అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మైనంపల్లి హనుమంత రావు స్వంత గ్రామమైనందువల్ల ఆయన కుమారుడిని పోటికి నిలబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పలు సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల మన్ననలు పొందిన నేతగా హనుమంత రావు కుమారుడు మైనంపల్లి రోహిత్ కు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు ఉంది.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో పాటు బి.ఆర్.ఎస్. అధిష్టానంతో మైనంపల్లికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఒక మంచి నాయుడుకి ఉండాల్సిన లక్షణాలన్నీ మైనంపల్లి రోహిత్ కు ఉన్నాయని హనుమంత రావు సన్నిహితులే తరుచూ ప్రస్తావింస్తుంటారు. ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నరోహిత్ ను మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనీ బి.ఆర్.ఎస్. వర్గాలు పట్టుబడుతున్నాయి. దీంతో వారి అభిష్టం మేరకు మైనంపల్లి రోహిత్ ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు.
పార్టీ అవకాశం ఇస్తే మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నాయకులతో మంచి సంబంధాలు కొనసాగించడం రోహిత్ కున్న ప్లస్ పాయింట్.. అంతేగాక నియోజకవర్గ ప్రజలకు పలు కార్యక్రమాల ద్వారా ఆయన దగ్గరయ్యారు. నేడు మెదక్ నియోజకవర్గంతో ఆయన బంధం పెనవేసుకుంది.
బి.ఆర్.ఎస్. పార్టీ రోహిత్ కు టికెట్ ఇస్తే ఆయన గెలుపు నల్లేరుపై నడక లాంటిదేనని అంటున్నారు మెదక్ నియోజక వర్గ ప్రజలు..

- Advertisement -

ప్రజలకు చేరువవుతున్న రోహిత్ :
మెదక్ నియోజకవర్గంలోని పలు పాఠశాలలు దీనావస్థలో ఉన్నాయి. వాటిని చూసి చలించి పోయిన రోహిత్ సంక్షేమ బడిబాట పట్టారు.. పాఠశాలల్లో మంచినీరు కొరకై విద్యార్థులు ఆందోళన పడుతున్న తరుణంలో రోహిత్ తన సొంత ఖర్చులతో మినీ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అంకితం ఇచ్చారు. అంతే కాకుండా విద్యార్థులకు అవసరమైన బాత్రూం సౌకర్యాలను కల్పిస్తూ విద్య, వైద్యం ఉపాధి వంటి అంశాలతో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గంలో తనకు పోటీ లేరని.. రారని సంక్షేమ కార్యక్రమాలతో ప్రతిపక్షాలు అసూయపడే విధంగా దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో యువతకు భరోసాగా నిలబడుతున్నారు..

మెరుగైన వైద్యం కోసం మెడికల్ క్యాంపులు :
మైనంపల్లి రోహిత్ తండ్రి ఇమేజ్ ని రెట్టింపు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. సీనియర్ నాయకులను కలుపుకుని పోతూ ప్రజలకు ప్రతి పల్లెలో మెరుగైన వైద్యం అందాలని హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మంచి తాగునీరు అందించి వారి ఆరోగ్యాలను కాపాడే దిశగా పనిచేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి తానే ఒక పెద్దదిక్కులా ఎవరైనా కోల్పోతే వారి ఇంట్లో ఉన్న చిన్నారుల పేరుపై 25 వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ పోస్టల్ బాండ్ను అందిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో సేవ చేయాలనే లక్ష్యంతో మూడు వందల మంది పేద కుటుంబాల ఆడపడుచులకు పుస్తె, మెట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టి వారికి అన్నగా బాసటగా నిలుస్తున్నారు.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 100 నుండి 150 వరకు 50 లీటర్ల నుండి 100 లీటర్ల సామర్థ్యం గల మినీ ఆర్వో ప్లాంట్లను అందించారు. అంతే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా మినీ ఆర్వో ప్లాంట్లను అందించాలన్న తలంపుతో ట్రై సైకిల్ లను 200 మంది వికలాంగులకు అందించారు. ఇటీవల ఎల్లాపూర్ గ్రామవాసి పాపన్నపేట మండలానికి చెందిన మలిదశ ఉద్యమకారుడు దుర్గా గౌడ్ అతని భార్య రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచి మరణించిన దుర్గా గౌడ్ కుమారున్ని తన సొంత డబ్బులతో చదివిస్తూ అన్ని బాగోగులు తానే ఒక అన్నగా చూసుకుంటున్న మైనంపల్లి రోహిత్ పదిమంది నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు నిర్మించి అందించారు.. ఇటీవల అకాల వర్షాల కారణంగా పెంకుటిన్లు వానకు కురుస్తుండటంతో ఇంట్లో నీరు చేరుతోందని స్థానికులు తెలపడంతో హుటాహుటిన వారి ఇండ్లపై కప్పుకోవడానికి తాత్కాలిక పరిష్కారంగా ఇంటి పై కప్పుకు జరిపే విధంగా ఒక్కో ఇంటికి 1,000కి పైగా కవర్లను బాధితులకు అందించడం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గ ప్రజలకు చేదోడుగా రోహిత్ ప్రబంజనం :
పాపన్నపేట మండలానికి చెందిన నార్సింగ్ గ్రామంలో, మెదక్ మండలానికి చెందిన గుట్ట కింద పల్లె చిట్యాల కర్జా హవేలీ ఘన్పూర్ వంటి పల్లెల్లో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీలు కూడా ఇస్తున్నారు ఇటీవల కాలంలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు దాదాపుగా 25 మంది పైచిలుకుగా సూపర్ మల్టీస్పెషల్టి ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించి తమ తమ గ్రామాలకు కొంత వెహికల్ లో పంపించి వారిని ఆదుకున్నారు. సేవా దృక్పథంతో నియోజకవర్గంలో ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని లక్ష్యంగా నియోజకవర్గంలో దాదాపుగా 200 పైచిలుకు బోర్లు వేయించి మంచినీరు సమస్యను తీర్చి ఇంకా ఎక్కడైనా బోరు లేక ఇబ్బందులు గురవుతున్న తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే దిశగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తామని తద్వారా కొన్ని వేల కుటుంబాలకు మేలు చేసిన వారిని అవుతానని ఆయన తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు ఉన్న పరిస్థితిని చూసి సమస్యలను పరిష్కరించే మార్గాలను ఎంచుకొని తద్వారా ప్రభుత్వ బాలికల పాఠశాలల లో మంచినీరు సౌకర్యాలు అలాగే ఎలక్ట్రిసిటీ పనులు వంటి లైటింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు.. మైనంపల్లి తనయుడు రానున్న ఎన్నికల్లో గెలుపు తనదేనని కేసీఆర్ దీవెనలు తనకు ఉన్నాయని మెదక్ ను అభివృద్ధి చేసి చూపుతానని సీనియర్ నాయకులు కార్యకర్తలను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకొని ఏ ఆపద వచ్చిన ముందుండి సమస్య పరిష్కారంగా పనిచేస్తానని రోహిత్ హామీ ఇస్తున్నారు. స్థానిక నాయకులు మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రోహిత్ ను కోరుకుంటున్నారని మైనంపల్లి తనయుడు ఎన్నికల బరిలో నిలిస్తే తప్పకుండా గెలిపించుకుని తీరుతామని అక్కడి ప్రజలు ధీమాగా చెబుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు