Friday, September 13, 2024
spot_img

మేడిపల్లి పోలీస్ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం

తప్పక చదవండి

మేడిపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మేడిపల్లి పోలీసు వారు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ” పోలీస్-సురక్ష దినోత్సవం” కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడిపల్లి నందు నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంతి కాలనీ, సాయి నగర్, ఇంద్రప్రస్థ కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ ప్రజలతో పోలీసు వారు మమేకమై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి ప్రభుత్వం ఏ విధంగా మౌలిక సదుపాయాలు పోలీస్ శాఖకు కల్పించింది.. ఇప్పటివరకు పోలీస్ శాఖ ఏ విధంగా ప్రజలకు చేరువయ్యింది, ఏ విధంగా ప్రజలకు సేవ చేసింది మరెన్నో విప్లవాత్మక మార్పుల ద్వారా భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అగ్రగామిగా దూసుకెళ్తూ ప్రజలకు, రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటూ డయల్ -100, షీ టీమ్స్ ,సైబర్ సేఫ్టీ, సెక్యూరిటీ, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా సీసీ కెమెరాల ద్వారా రక్షణ కల్పిస్తూ గత 9 ఏళ్లలో ఎంతో అద్భుతమైన ప్రగతిని, అభివృద్ధిని సాధించామని తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. “ఫ్రెండ్లీ పోలీసింగ్ ” వ్యవస్థ ద్వారా ప్రజలకు అత్యంత చేరువయ్యామని, నేరాలను అదుపు చేయడంలో గాని,దోషులను శిక్షించడంలో కానీ ప్రథమ స్థానంలో ఉన్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పోలీసులు నిస్వార్ధంగా సేవ చేస్తున్నారని, ప్రజలంతా గర్వపడాలని కుటుంబాలను త్యాగం చేస్తూ 24 గంటలు పనిచేస్తున్నారని పోలీసు సేవలను కొనియాడారు. పోలీసులను శాల్వలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాలనీ ప్రజలు,మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని, సురక్ష దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు